జనవరి నుండి మహేష్ - రాజమౌళి సినిమా ప్రారంభం..ఇంట్రడక్షన్ ఫైట్ మామూలుగా ఉండదు!

కోట్లాది మంది అభిమానులతో పాటు,ఇండియన్ మూవీ లవర్స్ మొత్తం ఎప్పటి నుండో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ – రాజమౌళి కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఖరారై దాదాపుగా పదేళ్లు అయ్యింది.

 Mahesh Babu Rajamouli Movie Introduction Fight Shooting Details, Mahesh Babu, Ra-TeluguStop.com

కానీ మహేష్( Mahesh Babu ) మరియు రాజమౌళి( Rajamouli ) ఎవరి సినిమాల షూటింగ్స్ లో వారు బిజీ గా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది.గత ఏడాది కాలం నుండి ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని డిజైన్ చేస్తూ ఉన్నాడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.

( Vijayendra Prasad ) ఎట్టకేలకు ఈ స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు చివరి దశకి చేరుకుందని, త్వరలోనే వర్క్ షాప్ కూడా మొదలు అవ్వబోతుందని టాక్.అయితే రీసెంట్ గానే సోషల్ మీడియా లో ఈ చిత్రం ప్రారంభం అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది, మహేష్ ఈలోపు ఒక ప్రాజెక్ట్ ని చేసే ఆలోచనలో ఉన్నాడంటూ వార్తలు వినిపించాయి.

Telugu Rajamouli, Guntur Karam, Mahesh Babu, Maheshbabu, Pan, Trivikram-Movie

అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని మహేష్ బాబు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.జనవరి నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రడక్షన్ సన్నివేశం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం కానుంది అని టాక్.ఎక్కడైనా సినిమా మొత్తానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్( Pre Production Work ) ప్రారంభం అవ్వడం గమనించాము.కానీ ఇక్కడ ఇంట్రడక్షన్ సన్నివేశం కోసం నెల రోజుల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరపబోతున్నారు అంటే ఈ సినిమాపై రాజమౌళి ఏ రేంజ్ లో ప్లాన్ చేసాడో అర్థం చేసుకోవచ్చు.

రాజమౌళి గత చిత్రం #RRR లో రామ్ చరణ్( Ram Charan ) ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశం రాజమౌళి కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు.చాలా సహజసిధ్ధం గా ఈ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించారు.

ఇప్పుడు మహేష్ తో చెయ్యబోయే సన్నివేశం ఇప్పటి వరకు ప్రపంచ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా ఉండబోతుంది అట.

Telugu Rajamouli, Guntur Karam, Mahesh Babu, Maheshbabu, Pan, Trivikram-Movie

మరో విషయం ఏమిటంటే ఈ సినిమాని రాజమౌళి తన కెరీర్ లో అత్యంత వేగవంతమైన సినిమాగా తీర్చి దిద్దాలని ప్లాన్ చేస్తున్నాడట. #RRR సినిమా కూడా మధ్యలో కరోనా రాకపొయ్యుంటే ఏడాది లోనే షూటింగ్ మొత్తం పూర్తి అయ్యేది.కానీ కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యం గా విడుదల అయ్యింది.

కానీ ఈ చిత్రం పక్క ప్రణాళిక తో ప్రారంభం కాబోతుందని, అనుకున్న సమయానికే సినిమా అభిమానుల ముందుకు వస్తుందని అంటున్నారు.ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ‘గుంటూరు కారం’( Guntur Karam Movie ) అనే చిత్రం చేస్తున్నాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube