తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమైన వైఎస్ఆర్‎టీపీ..!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వైఎస్ఆర్‎టీపీ సిద్ధం అవుతోందని తెలుస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల కార్యాచరణను ప్రకటించనున్నారని సమాచారం.

 Ysrtp Is Ready To Fight Alone In Telangana..!-TeluguStop.com

ఈనెల 12 వ తేదీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆరుగురు సభ్యులతో ప్రత్యేక మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు.కాగా ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇవాళ, రేపు పార్టీ కార్యకర్తలతో షర్మిల కీలక సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే షర్మిల త్వరలోనే పాలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube