భారీ ప్రమాదం నుంచి బయటపడిన బాలీవుడ్ నటి.. ఇద్దరు మృతి?

తాజాగా బాలీవుడ్ నటి గాయత్రి జోషి( Bollywood Actress Gayatri Joshi ) ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు.ఆమె తన భర్త వికాశ్ ఒబెరాయ్‌తో కలిసి ఇటలీలో సూపర్ కారులో ప్రయాణిస్తుండగా ఒక ప్రమాదానికి గురయ్యారు.

 Gayatri Joshi And Husband Vikas Oberoi Met With A Car Accident In Italy, Gayatri-TeluguStop.com

కాగా ఆ ప్రమాదంలో మరో కారులో ప్రయాణిస్తున్న దంపతులు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా గాయత్రి, వికాశ్ అదృష్టవశాత్తు బయటపడ్డారు.అయితే ఈ జంట గత కొద్ది రోజులుగా ఇటలీ వెకేషన్‌లో ఉన్నారు.

విహారయాత్రలో భాగంగా వారు లాంబోర్గిని కారులో ప్రయాణిస్తుండగా ఈ లగ్జరీ కారు మరో ఫెరరీ సూపర్ కారును ఢీకొట్టి ఆ వెంటనే ఒక క్యాంపెర్ వ్యాన్ ఎత్తి కుదేసింది.ఈ ప్రమాదంలో ఫెరారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.

ఇటలీ( Italy )లో సంపన్న పర్యాటకులకు సూపర్ కార్ టూర్ నిర్వహించారు.సర్దినియా ద్వీపంలో ట్యూలాడా నుంచి ఒల్బియా వరకు సర్దినియా సూపర్‌కార్ టూర్ పేరిట లగ్జరీ కార్ల పరేడ్ నిర్వహించారు.ఈ పరేడ్‌లో గాయత్రి జోషి, వికాశ్ ఒబెరాయ్ దంపతులు కూడా పాల్గొన్నారు.వీరు లాంబోర్గిని సూపర్ కార్‌( Luxurious Lamborghini Car )లో బయలుదేరారు.వీరు ప్రయాణించేది రూరల్ రోడ్.కాస్త ఇరుకుగా ఉంటుంది.

వీరి లాంబోర్గిని కారు క్యాంపెర్ వ్యాన్‌ను ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఫెరారీ కారు ఒకదానినొకటి సమాంతంగా ఢీకొన్నాయి.అత్యంత వేగంగా ఢీకొనడంతో ఫెరారీ కారు పల్టీలు కొట్టింది.

లాంబోర్గిని కారు వ్యాన్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో వ్యాన్ రోడ్డుపై బోల్తాపడింది.

లాంబోర్గిని కారు రోడ్డు పక్కకు దూసుకుపోయింది.ఈ ఘోర ప్రమాదంలో ఫెరారీ కారులో ప్రయాణిస్తున్న స్విట్జర్లాండ్‌కు చెందిన దంపతులు మెలిసా క్రౌట్లి (63), మార్కస్ క్రౌట్లి (67) మృతి చెందారు.కారుకు మంటలు వ్యాపించడంతో సజీవ దహనమైనట్లు సమాచారం.

అయితే, ఈ ప్రమాదం అదే రోడ్‌లో ప్రయాణిస్తున్న మరో కారు డాష్ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యింది.దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ప్రమాదం నుంచి గాయత్రి, ఆమె భర్త ప్రాణాలతో బయటపడడంతో వారి సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube