Sreeleela : ఆ రెండు సినిమాలు హిట్టైతేనే శ్రీలీలకు ఆఫర్లు వస్తాయా.. కౌంట్ డౌన్ షురూ అయ్యిందంటూ?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల( Sreeleela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల ఆ తర్వాత ధమాకా సినిమాలో నటించింది.

 Sreeleela Missed One Chance 4 More Chances-TeluguStop.com

తాజాగా స్కంద సినిమా( Skanda )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ నటించినది మూడు సినిమాలే అయినప్పటికీ ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

అంతేకాకుండా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కూడా రాణిస్తోంది శ్రీ లీలా.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రీలీల కెరీర్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీలీలకు కౌంట్ డౌన్ షురూ అయిందట.

Telugu Aadikeshava, Guntur Kaaram, Offers, Skanda, Sreeleela, Tollywood-Movie

వరుసపెట్టి సినిమాలకు ఓకే చెబుతోంది శ్రీలీల.( Sreeleela ) ఇలా అడ్వాన్స్ అందుకోవడం, అలా కాల్షీట్ ఇవ్వడం కామన్ అయిపోయింది.కానీ ఏ హీరోయిన్ కి అయినా 2-3 సినిమాలతో జాతకం తేలిపోతుంది.

మొన్నటికి మొన్న కృతి శెట్టి విషయంలో కూడా ఇదే జరిగింది.ఇప్పుడు శ్రీలీల విషయంలో కూడా ఇదే రిపీట్ కాబోతోంది.

ఆమె నటించిన స్కంద సినిమా ఇప్పటికే విమర్శలపాలైంది.ఇందులో శ్రీలీల పర్ఫామెన్స్ కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు అంటూ రివ్యూస్ కూడా వచ్చాయి.

ఇకపోతే శ్రీలీల చేతిలో మిగిలినవి మరో 4 సినిమాలు మాత్రమే.ఈ నెలలో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) వస్తోంది.

అందులో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు.ఆ తర్వాత నెల రోజులకు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ( Aadikeshava )వస్తోంది.

Telugu Aadikeshava, Guntur Kaaram, Offers, Skanda, Sreeleela, Tollywood-Movie

ఇక సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం( Guntur Kaaram ) ఉంది.మధ్యలో నితిన్ తో చేస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ కూడా రాబోతోంది.ఇలా ఇప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విడుదల కానున్నాయి.ఈ 4 సినిమాల్లో కనీసం 2 సినిమాలు హిట్టయితేనే శ్రీలీల కెరీర్ సాఫీగా సాగుతుంది.

మరీ ముఖ్యంగా మహేష్ బాబు, బాలకృష్ణ సినిమాలు హిట్టవ్వడం శ్రీలీలకు చాలా అవసరం.ఒకవేళ ఈ నాలుగు సినిమాలలో ఏ రెండు సినిమాలు అయినా ఫ్లాప్ అయితే ఈ ముద్దుగుమ్మ డేంజర్ జోన్ లో పడ్డట్టే.

కాబట్టి శ్రీలీల నటిస్తున్న ఈ నాలుగు సినిమాలు ఆమె కెరియర్ను డిసైడ్ చేయనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube