బ్యూటీ పరిణీతి చోప్రా ( Parineeti Chopra ) ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ( Raghav Chadha ) పెళ్లి సందడి సంగతి మనకు తెలిసిందే.వీరి వివాహం ఉదయపూర్ ( Udaipur ) లోని ఒక పురాతన ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఇప్పటికే వీరి హల్ది సంగీత వేడుకలు ఎంతో ఘంగా జరిగాయి.ఇలా ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వధూవరుల కుటుంబ సభ్యులు ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఆదివారం ఉదయం పరిణితి రాఘవ్ ల వివాహం ఎంతో ఘనంగా జరగబోతుంది.ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు.
ఈ విధంగా వీరి వివాహ వేడుకకు హాజరయ్యే విఐపి ల కోసం ప్రత్యేకంగా అధునాతన సౌకర్యాలతో ఉన్నటువంటి సెవెన్ స్టార్ హోటల్లను బుక్ చేసి అన్ని ఏర్పాట్లను చేశారు ఈ క్రమంలోనే వచ్చే అతిథిల కోసం ఈ దంపతులు ఏర్పాటు చేసినటువంటి హోటల్ సూట్ రెంట్ తెలిసి ప్రస్తుతం అందరూ షాక్ అవుతున్నారు.సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్( Leela Palace , Taj Lake Palace ) లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్లను లాక్ చేసుకున్నారు.వీరి పెళ్లికి బుక్ చేసిన హోటల్లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దెఎంత అనేది ఆసక్తికరంగా మారింది.ఈ హోటల్లో ఒకరోజు రాత్రి స్టే చేయాలి అంటే ఏకంగా 10 లక్షల రూపాయలు అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది.
ఇక లీల ప్యాలెస్ లో జరగబోతున్నటువంటి వీరి వివాహానికి కూడా అంతే ఘనంగా ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది.ఇలా వీరిద్దరూ వీరి వివాహ వేడుక కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.ఇలా కొంతమంది కుటుంబ సభ్యులు సన్నిహితులు రాజకీయ నాయకుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఆదివారం ఎంతో ఘనంగా జరగబోతుంది.ఇక వీరి వివాహం అనంతరం గురుగ్రామ్ లో వీరి వివాహ రిసెప్షన్ వేడుక జరగబోతున్నట్లు వెల్లడించారు.
ఇక ఈ రిసెప్షన్ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరితో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.