బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఒకరు.ఈమె హీరోయిన్ గా ధఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వక పోయిన జాన్వీ అందం, నటనకు మంచి పేరు అయితే వచ్చింది.ప్రెజెంట్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ఈమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే సౌత్ ఎంట్రీకి కూడా సిధ్దం అవుతుంది.జాన్వీ కపూర్ చాలా రోజులుగా తెలుగు మూవీ చేయడం కోసం ఎదురు చూస్తుంది.
ఈ క్రమంలోనే కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ”దేవర” వంటి భారీ ప్రాజెక్టులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
జాన్వీకి ఇదే తొలి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం.అందుకే ఈ సినిమా కోసం ఈమె చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది.ఇప్పటికే ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అవ్వగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
ఇదే కాకుండా తెలుగులో చాలా అవకాశాలు వస్తున్న కూడా ఈమె ఆచితూచి అడుగులు వేస్తుంది.ప్రజెంట్ దేవర సినిమాతో( Devara Movie ) బిజీగా ఉంది.
మరి ఈ సినిమాకు గాను ఈమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే విషయంలో నెట్టింట ఒక వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమా కోసం ఈ అమ్మడికి ఏకంగా 5 కోట్లు ఇస్తున్నట్టు టాక్.ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో ఈమెకు ఇంత ఇచ్చి మరీ తెలుగు లోకి తీసుకు వస్తున్నట్టు సమాచారం.మొత్తానికి మొదటి సినిమాకే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ భామ ఇది హిట్ అయితే మరింత డిమాండ్ చేయడం ఖాయం.