ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తుపై బీజేపీ రియాక్షన్

ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ స్పందించింది.రాష్ట్రంలో జనసేన, టీడీపీతో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నట్లు పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

 Bjp Reaction On Alliance With Tdp And Janasena In Ap-TeluguStop.com

ఈ క్రమంలో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయనే అభిప్రాయాన్ని జనసేనాని వ్యక్తం చేశారు.అయితే దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం పొత్తుల అంశంపై నిర్ణయం జాతీయ నాయకత్వం చూసుకుంటుందని స్పష్టం చేసింది.

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో కేంద్ర నాయకత్వమే స్పష్టత ఇస్తుందని పేర్కొంది.పొత్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయిస్తారని వెల్లడించింది.

ప్రస్తుతానికి ఏపీలో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube