చంద్రబాబు అరెస్టుపై రజనీ అలా రియాక్ట్ అయ్యారా... నా స్నేహితుడు తప్పు చేసి ఉండరంటూ?

అవినీతి కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు( Chandrababu Naidu ) అరెస్టు కావడంతో ఇప్పటికే ఎంతోమంది సినిమా సెలబ్రెటీలు అరెస్టుపై స్పందిస్తూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారు అంటూ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలుపుతున్నారు.ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఎంతోమంది నిర్మాతలు సెలబ్రిటీలు అరెస్టు విషయంపై స్పందిస్తూ వారి పూర్తి మద్దతును తెలియజేశారు.

 Superstar Rajinikanth Call To Nara Lokesh Over His Father Chandrababu Naidu Arre-TeluguStop.com

ఈ క్రమంలోని చంద్రబాబు నాయుడుకు స్నేహితుడు అయినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారని తెలుస్తోంది.

Telugu Ap, Chandrababu, Lokesh, Rajinikanth-Movie

చంద్రబాబు నాయుడు రజనీకాంత్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.తాజాగా ఈయన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో కూడా పాల్గొని చంద్రబాబు గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అందరికీ తెలిసిందే.అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Arrest ) అయ్యారనే విషయం తెలియడంతో రజనీకాంత్ వ్యక్తిగతంగా లోకేష్ (Lokesh) కు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించారని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని స్వయంగా లోకేష్ వెల్లడించినట్టు సమాచారం.

Telugu Ap, Chandrababu, Lokesh, Rajinikanth-Movie

రజనీకాంత్ లోకేష్( Nara Lokesh ) కు ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని తెలియజేశారట.నా స్నేహితుడు ఎలాంటి తప్పు చేసి ఉండరు.ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఆయనని బయటకు తీసుకు వస్తాయని అందరూ ధైర్యంగా ఉండాలని రజనీకాంత్ చెప్పినట్టు సమాచారం.

అయితే రజనీకాంత్ చంద్రబాబు నాయుడు విషయంపై ఆయనకు మద్దతు తెలుపుతున్నట్టు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో అధికారికంగా తెలియజేయలేదు కానీ వ్యక్తిగతంగా మాత్రం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కి ఫోన్ చేసి తమ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని మాత్రం తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube