తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది.ఇందులో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రణాళిక మరియు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
అదేవిధంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం దీనిపై పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.దాంతోపాటు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల నుంచి వస్తున్న స్పందనపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే ముఖ్య నాయకులు అంతా కచ్చితంగా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రకాశ్ జవదేకర్ దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పదాధికారులు సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాముఖ్యత నెలకొంది.