కృష్ణునిపై భక్తితో 88 వంటకాలతో నైవేద్యం సమర్పించిన భక్తురాలు.. ఈమె భక్తికి గ్రేట్ అనాల్సిందే!

తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి( Shri Krishna Janmashtami ) సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు.అందరు సింపుల్ గా ఇంట్లో పూజ చేసుకోగా మరికొందరు ఆలయాలను సందర్శించి రాధాకృష్ణులను భక్తిశ్రద్ధలతో పూజించారు.

 Woman From Mangalore Prepares 88 Dishes For Janmashtami Celebrations, Mangalore-TeluguStop.com

చాలామంది చిన్నపిల్లలను కృష్ణుడు గోపికల వేషంలో అలంకరించి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి చాలా ఆనందించారు.చిట్టి చిట్టి కృష్ణులు గోపికలు ముద్దు ముద్దు మాటలతో ఇంట్లోకి అడుగు పెడుతుంటే అవి చూసి తల్లిదండ్రులు సంతోషపడ్డారు.

Telugu Janmashtami, Mangalore, Dishes-Latest News - Telugu

కాగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చాలా ఆలయాల్లో శ్రీకృష్ణునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.ఈ పండుగ సందర్బంగా కర్ణాటకలో( Karnataka ) ఒక మహిళ చేసిన పనికి ప్రతి ఒక్కరూ ఆమెకు హాట్సాఫ్ చెప్పడంతో పాటు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన ఒక మహిళ కృష్ణుడిపై తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. లడ్డూ, బర్ఫీ, అరిసెలు, గారెలు, జిలేబీ ఇలా పది ఇరవై కాదండోయ్ ఏకంగా 88 వంటకాలతో నైవేద్యం సమర్పించారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Telugu Janmashtami, Mangalore, Dishes-Latest News - Telugu

శ్రీకృష్ణుడిపై ఆమెకు ఉన్న భక్తిని చూసి నేటిజన్స్ భక్తులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ముఖ్యంగా ఆమె ఓపికను అందరూ మెచ్చుకుంటున్నారు.ఈ విషయంపై స్పందించిన ఒక వ్యక్తి.

ఆమె నా పేషెంట్‌.గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ.

నా వద్దే చికిత్స తీసుకున్నారు.ఒక్కరాత్రిలో 88 వంటకాలు సిద్ధం చేసి గతంలో ఆమె నెలకొల్పిన రికార్డును ఆమే బ్రేక్‌ చేశారు అని కామత్‌ రాసుకొచ్చారు.

నిజంగా ఆ మహిళ శ్రీకృష్ణుని పట్ల ఉన్న భక్తిని చాటుకోవడంతో పాటు అంత ఓపికగా అన్ని వంటలు చేయడం అన్నది గొప్ప విషయమే అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube