ఐదేళ్ల వయస్సులో ఇంటినుంచి పారిపోయింది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. దియా మీర్జా సక్సెస్ స్టోరీ ఇదే!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో దియా మీర్జా( Dia Mirza ) ఒకరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్ గా దియా మీర్జా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించారు.

 Actress Dia Mirza Comments Goes Viral In Social Media Details, Dia Mirza, Heroin-TeluguStop.com

ఫెమినా మిస్ ఇండియా 2000 టైటిల్ ను( Femina Miss India 2000 Title ) గెలుచుకున్న దియా మీర్జా రెహనా హై టెర్రే హిల్ మే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమా సక్సెస్ సాధించడంతో దియా మీర్జా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన దియా మీర్జా, ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.ప్రతిభ ఆధారంగా కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన దియా మీర్జా గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడం గమనార్హం.

దియా మీర్జా తల్లి బెంగాళీ కాగా తండ్రి జర్మనీకి చెందినవారని తెలుస్తోంది.దియా పుట్టిన తర్వాత ఆమె తల్లి భర్త నుంచి విడిపోయారని సమాచారం.

ఆ తర్వాత దియా మీర్జా తల్లి( Dia Mirza Mother ) మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు.తన సవతి తండ్రి పేరును దియా మీర్జా ఇంటిపేరుగా మార్చుకోవడం జరిగింది.ఐదేళ్ల వయస్సులోనే తండ్రిపై కోపాన్ని పెంచుకున్న దియా మీర్జా ఇంటినుంచి పారిపోయి బంధువుల వద్దకు వెళ్లారు.ఆ తర్వాత దియా మీర్జా పెరిగి పెద్దై 5,000 రూపాయల వేతనానికి మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా( Marketing Executive ) చేరారు.

2001 సంవత్సరంలో దియా మీర్జా నటించిన రెహ్నా హై తేరే దిల్ మే మూవీ( Rehna Hai Terre Dil Mein ) 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బాలీవుడ్ లోని రొమాంటిక్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలవడం గమనార్హం.ఈ సినిమాలో సాధారణ అమ్మాయి పాత్రలో నటించి దియా మీర్జా మెప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube