ఏపీలో కే‌సి‌ఆర్ ఎంట్రీ ఎప్పుడు ?

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు( Telangana Elections ) మరో మూడు నెలల్లో జరగనున్నాయి.దాంతో అధికార బి‌ఆర్‌ఎస్( BRS ) దృష్టంతా తెలంగాణపైనే ఉంది.

 When Will Kcr Entry In Ap?,cm Kcr,ap Politics,ycp,bjp,congress,cm Kcr Ap Politic-TeluguStop.com

ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి వచ్చి ముచ్చటగా మూడోసారి సి‌ఎం పదవి ఆధిష్టించాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నారు.అయితే బి‌ఆర్‌ఎస్ ను జాతీయ పార్టీగా నిలబలని కే‌సి‌ఆర్‌ కలలు కంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మహారాష్ట్రలో పార్టీకి గట్టిగానే పునాదులు వేశారు.కానీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ పై మాత్రం గులాభి బాస్ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం లేదు.

ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు.

Telugu Ap, Cm Kcr, Cm Kcr Ap, Congress, National, Telangana, Kcr Ap-Politics

సరిగ్గా ఎనిమిది నెలల టైమ్ మాత్రమే ఉంది.అయినప్పటికి బి‌ఆర్‌ఎస్( BRS ) ఇంకా ఎలాంటి గ్రాండ్ వర్క్ స్టార్ట్ చేయలేదు.మరోవైపు ఏపీలోని ప్రధాన పార్టీలు అయిన టిడిపి, వైసీపీ, జనసేన పార్టీలు యమ దూకుడుగా వ్యవహరిస్తూ ఎలక్షన్స్ రేపో మాపో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి.

మరి ఏపీలో కూడా సత్తా చాటుతాం అని పదే పదే చెప్పే కే‌సి‌ఆర్ ఎందుకు ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై( AP Poltiics ) ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.అయితే తెలంగాణ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఏపీపై దృష్టి పెడతాం అంటూ ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

Telugu Ap, Cm Kcr, Cm Kcr Ap, Congress, National, Telangana, Kcr Ap-Politics

అయితే తెలంగాణలో ఈసారి బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని సర్వేలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఒకవేళ తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ విజయం ఏ మాత్రం తేదకొట్టిన, ఆ ప్రభావం జాతీయ రాజకీయాలపై( KCR National Politics ) గట్టిగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఏపీలోని అన్నీ నియోజిక వర్గాల్లో బి‌ఆర్‌ఎస్ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో విజయం దక్కకపోతే ఏపీలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది.మొత్తానికి ఏపీ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ ను చూడాలని రెండు తెలుగురాష్ట్రాల్లో ఎదురుచూపులు నడుస్తుండగా.

మరి ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube