సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి ఆవులు మేపుతూ లక్షల్లో సంపాదిస్తున్న వ్యక్తి.. సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో చాలామంది ఉద్యోగం కంటే వ్యాపారం( Business ) బెస్ట్ అని భావిస్తున్నారు.వ్యాపారం చేయడం ద్వారా కొంతమంది కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు.

 Nellore Vinod Kumar Success Story Details, Vinod Kumar, Palaparthi Vinod Kumar,-TeluguStop.com

సాఫ్ట్ వేర్ జాబ్ కు గుడ్ బై చెప్పి ఆవులు మేపుతూ లక్షల్లో సంపాదిస్తున్నాడు.సాఫ్ట్ వేర్ ఉద్యోగం కంటే వ్యవసాయం, ఆవుల పోషణలోనే సంతోషం ఉందని నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన వినోద్ కుమార్( Vinod Kumar ) చెబుతున్నారు.

మనస్సుకు నచ్చిన పని చేయాలనే ఆలోచనతో సాఫ్ట్ వేర్ జాబ్( Software Job ) వదిలి ఈ పని చేస్తున్నానని ఆయన చెబుతున్నారు.ఇంజనీరింగ్ చదువుకున్న పాలపర్తి వినోద్ కుమార్ తల్లీదండ్రులు ఆవులను అమ్మేస్తామని చెప్పగా అలా చేయడం తనకు ఇష్టం లేకపోవడంతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు.

లక్షల్లో వచ్చే జీతం వదిలి తన కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకుంటూ కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుంటున్నారు.

Telugu Cows, Palahivinod, Simen Stall, Software Job, Vinod Kumar-Movie

ఆవుల ద్వారా( Cows ) వచ్చే పేడను పొలంలో ఎరువుగా వినియోగిస్తూ తక్కువ ఖర్చుతో వినోద్ కుమార్ పంటలను సాగు చేస్తున్నాడు.ఎంతోమందికి వినోద్ కుమార్ స్పూర్తిగా నిలుస్తున్నాడు.ఒంగోలు ఆవులు( Ongole Cows ) అంతరించకూడదని వినోద్ కుమార్ సెమెన్ స్టాల్ ఏర్పాటు చేశారు.

ఒంగోలు జాతి ఆవుల పోషణలో సలహాలు, సూచనలు ఇస్తానని వినోద్ కుమార్ చెబుతున్నారు.పాల వ్యాపారం, వ్యవసాయం ద్వారా ఎంతోమంది యువతకు వినోద్ కుమార్ స్పూర్తిగా నిలుస్తున్నారు.

Telugu Cows, Palahivinod, Simen Stall, Software Job, Vinod Kumar-Movie

సొంతూరిలో ఉండటం సంతోషంగా ఉందని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సంపాదించే మొత్తంతో పోల్చిచూస్తే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నానని వినోద్ కుమార్ చెబుతున్నారు.100 మందిలో 10 మంది వ్యవసాయం చేస్తే బాగుంటుందని వినోద్ కుమార్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.వినోద్ కుమార్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube