ఎల్‌ఐసీ, మూచ్యువల్ ఫండ్స్‌కి తేడాలివే.. రెండిటిలో ఏది బెటర్..?

డబ్బులను పొదుపు చేసుకోవాలని చాలామందికి ఉంటుంది.కానీ ఎందులో పెట్టుబడి పెట్టాలనేది చాలామందికి తెలియక ఆలోచిస్తూ ఉంటారు.

 Difference Between Lic And Mutual Funds Which One Is Better , Differences Lic, M-TeluguStop.com

కొంతమంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ( Life Insurance Corporation )అందించే వివిధ స్కీమ్స్ లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు.అలాగే మరికొంతమంది తక్కువ రిస్క్ ఉండే మూచ్యువల్ ఫండ్స్‌ని ఎంచుకుంటూ ఉంటారు.

ఎల్‌ఐసీలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ గనుక డబ్బులు సేఫ్ గా ఉంటాయి.

అలాగే కాల వ్యవధి పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి డబ్బులు చెల్లిస్తారు.

Telugu Lic, Financial, Tips, Mutual Funds-Latest News - Telugu

అయితే ఎల్ఐసీ, మ్యూచువల్ ఫండ్స్ ( LIC, Mutual Funds )లలో ఎందులో పెడితే అధిక ఆదాయం వస్తుందనేది ఆలోచించుకుని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచిది.ఎల్‌ఐసీలో పెట్టుబడి పెడితే రిస్క్ కవరేజ్ తో పాటు ఆర్ధిక భద్రత ఉంటుంది.కాల వ్యవధిలో పాలసీదారులు మరణిస్తే కుటుంబసభ్యులకు పాలసీ పూర్తి నగదు తిరిగి చెల్లిస్తారు.

ఇక మ్యూచువల్ ఫండ్స్ లలో రెండు రకాలు ఉంటాయి.డెట్, ఈక్విటీ మూచ్యువల్ ఫండ్స్.

డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీ, మనీ మార్కెట్ సాధనాలు, బాండ్లలో పెట్టుబడి పెడతారు.ఇక ఈక్విటీ మూచ్యువల్ ఫండ్స్ విషయానికొస్తే.

స్టాక్ మార్కెట్ తో ఆధారపడి ఉంటాయి.ఈక్విటీ( Equity ) అనగా స్టాక్ మార్కెట్ లోని కంపెనీలలో మీ డబ్బును పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది.

Telugu Lic, Financial, Tips, Mutual Funds-Latest News - Telugu

రూ.500 నుంచి మూచ్యువల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎల్‌ఐసీ పాలసీలకు( LIC policies ) కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది కనుక ఎలాంటి రిస్క్ ఉండదు.అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టార్ మార్కెట్ రిస్క్ పై ఆధారపడి ఉంటాయి.

కాకపోతే ఎల్‌ఐసీ కంటే మ్యుచువల్ ఫండ్స్ అధిక రాబడిని అందిస్తాయి.ఎల్‌ఐసీతో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే రెండితల అధిక రాబడి వస్తుంది.

ఇక ఎల్‌ఐసీ విషయానికొస్తే.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ కింత జీవిత బీమాపై రూ.1.5 లక్షల వరకు ప్రీమియం చెల్లింపుల నుంచి పన్ను మినహాయింపు పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube