టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ( Viraj aswin )కలిసి నటించిన తాజా చిత్రం బేబీ.ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.90 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.థియేటర్ లో విడుదల అయ్యి ఈ మంచి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా ఓటీటీ లో కూడా విజయాన్ని అందుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా ఓటీటీ వాట్సాప్ బేబీ పేరుతో వైష్ణవి చైతన్య( Vaishnavi chaitanya )కి సంబందించిన వీడియోను షేర్ చేసింది.ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు వైష్ణవి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకుంటావ్? అని అడగ్గా.ఇద్దరినీ కాదు అని వైష్ణవి సమాధానం ఇచ్చింది.
అయితే, ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ నాకు నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది.అలాగే, బేబీ సినిమా( Baby movie )లో వైష్ణవి చేసింది కరెక్టేనా? అని అడగ్గా, ఇలా చేయొద్దు.అలా చేయొద్దు.అంటూ మనకి మనం పరిమితులు పెట్టుకోలేం కదా.
ఆ పాత్ర తీరును బట్టి, ఆ సమయంలో ఏం అనిపిస్తే వైష్ణవి అది చేసింది అని రిప్లై ఇచ్చింది.సందర్భంగా వైష్ణవి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.