తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) గురించి మనందరికీ తెలిసిందే.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
తరచూ సినిమాలకు సంబంధించిన విషయాలు అలాగే ఏదో ఒక కాంట్రవర్సీలో విశ్వక్ సేన్ నిలుస్తూనే ఉంటాడు.ఇకపోతే ప్రస్తుతం ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతు,వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఇటీవల దాస్ కా దమ్కీ( Das Ka Damki ) సినిమాతో మన ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు.
అందులో నెగిటివ్ షేడ్ లోనూ నటించి షాకిచ్చాడు.విశ్వక్ సేన్ ప్రతి విషయంలోనూ చాలా బోల్డ్ గా ఉంటాడు.తనకు నచ్చిన విషయాన్ని, నచ్చని విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు.
తనను ఎవరైనా విమర్శించినా, తాను ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలన్నా, ఏ మాత్రం భయపడడు.కాగా ఇటీవల బేబీ మూవీ విషయంలో డైరెక్టర్ సాయి రాజేష్( Director Sai Rajesh ) కి ఈ విధంగానే గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా పాన్ ఇండియా మూవీల గురించి సంచలన వాఖ్యలు వాఖ్యలు చేశాడు.ఒక ఈవెంట్ కి హాజరైన ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
బేసికల్ గా మనమందరం మనకు అన్నీ తెలుసు మేథావులం అనుకుంటూ ఉంటారు.ఆ మేరకు లెక్కలు వేసుకుంటూ ఉంటారు.కొన్నిసార్లు మనం పాన్ ఇండియా సినిమా తీద్దాం అనుకుంటాం, కానీ అది గల్లీ సినిమా( Gully movie ) అవుతుందని, కొన్నిసార్లు చిన్న సినిమా తీస్తే, అది పాన్ ఇండియా సినిమా అవుతుందని తెలిపాడు విశ్వక్ సేన్.సినిమాల పరంగా ఏది వంద కోట్లు అవుతుందో, ఏది పాన్ ఇండియా అవుతుందో ఎవరికీ తెలియదు.
అయితే, తాను మాత్రం ప్రతి సినిమాకీ పాన్ ఇండియా సినిమాలాగే కష్టపడుతూ ఉంటానని చెప్పుకొచ్చాడు విశ్వక్సేన్.అంతేకానీ, ఇది రూ.100కోట్లు కొడతది, రూ.200కోట్లు కొడతది అని లెక్కలేసుకునే మేధావిని అయితే కాదు అని తెలిపారు.కాగా, ప్రస్తుతం విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.అయితే, విశ్వక్ ఈ కామెంట్స్ విజయ్ దేవర కొండను ఉద్దేశించి చేశారు అంటూ నెటిజన్లు భావిస్తున్నారు.
నాని, విశ్వక్ సేన్ లాంటివారు మంచి మార్కెట్ ఉన్న హీరోలను చూసి జెలసీ ఫీలౌతున్నారని, అందుకే ఇలా అంటున్నారని మరి కొందరు అంటున్నారు.