దారుణం: 8 నెలల గర్భవతిని చిదిమేసిన తల్లిదండ్రులు?

అవును, మీరు విన్నది నిజమే.ప్రపంచం ఎటుపోతోందో తెలియడం లేదు.

 Atrocious 8-month-pregnant Parents, 8 Months Pregnant, Parents, Pregnant Murder-TeluguStop.com

ఉత్తర్​ ప్రదేశ్​లో ( Uttar Pradesh )జరిగిన ఓ దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.గర్భవతి అయిన యువతిని, ఆమె తల్లిదండ్రులు అత్యంత కిరాతకంగా చంపేశారు.

విషయం ఏమిటంటే, ప్రియుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఆమె నిరాకరించడమే ఆమె పాలిట శాపం అయింది.ఉత్తర్​ ప్రదేశ్​ మజాఫర్​నగర్​కు ( Mazzafarnagar )చెందిన ఓ 19ఏళ్ల యువతి ప్రేమలో పడింది.దానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించడంతో తన ప్రియుడు రాహుల్​తో కలిసి.2022 అక్టోబర్​లో ఇల్లు విడిచి వెళ్లిపోయింది.ఈ క్రమంలో యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telugu Pregnant, Latest-Latest News - Telugu

ఆ తరువాత గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.డిసెంబర్​లో ఈ ప్రేమ జంటను ట్రేస్​ చేసి పట్టుకున్నారు.తరువాత యువతిని, ఆమె కుటుంసభ్యులకు అప్పగించి.

కావాలనే యువకుడిపై కిడ్నాప్​, రేప్​ కేసులు వేసి జైలుకు తరలించారు.ఈ కేసుపై కొంతకాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ క్రమంలోనే యువతి గర్భం దాల్చిందని తేలింది.అయితే రాహుల్​కు శిక్షపడాలని యువతి తల్లిదండ్రులు బలంగా కోరుకోవడం చేత కూతురు తన ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని అనేకమార్లు ఒత్తిడి చేశారు.

కానీ ఆమె దానికి అంగీకరించలేదు.

Telugu Pregnant, Latest-Latest News - Telugu

దాంతో ఆమె తల్లిదండ్రులు( parents ) ఆమెని చంపేయాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన కీలక విచారణ జరగాల్సి ఉండగా యువతి, ఆమె తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లలేదు.అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా పోలీసులకు అసలు విషయం బయటపడింది.

రాహుల్​కు వ్యతిరేకంగా స్టేట్​మెంట్​ ఇవ్వనని కూతురు చెప్పడంతో తల్లిదండ్రులకు తీవ్ర కోపం వచ్చి సొంత బిడ్డను గొంతు నులిమి చంపేసినట్టు తెలుసుకున్నారు.అప్పటికి ఆమె 8 నెలల గర్భవతి.

చంపిన తరువాత యువతి మృతదేహాన్ని గోయ్​లా గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో పడేశారు.పోలీసులకు విచారణలో భాగంగా జరిగిన తంతుని ఆమె తల్లిదండ్రులే ఒప్పుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube