బీజేపీ కి బై బై ! కాంగ్రెస్ లోకి ఆ మాజీ మంత్రి !

కొద్దిరోజుల క్రితం వరకు తెలంగాణ బిజెపిలోకి పెద్ద ఎత్తున చేరికలు చోటు చేసుకునేవి.చేరికలతో ఆ పార్టీ మరింతగా బలోపేతం అయింది.

 Bye Bye To Bjp! The Former Minister Into The Congress, Chandra Shekhar, Eatala R-TeluguStop.com

అధికార పార్టీ బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బిజెపి( BJP party ) ఎదిగింది.ఈ విషయంలో కాంగ్రెస్ వెనుకబడినట్లు కనిపించినా,  ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ లోకి చేరికలు ఊపందుకున్నాయి.

ఇటీవల కాలంలో కాంగ్రెస్ బాగా బలోపేతం అవుతుండడం,  బిఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో చాలామంది నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే బిజెపిలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్( Chandra Shekhar ) ఆ పార్టీకి రాజీనామా చేస్తూ.

రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కి పంపించారు
.

Telugu Brs, Chandra Shekhar, Congress, Eatala Rajender, Telangana-Politics

 పార్టీలో పని చేసే వారిని ప్రోత్సహించడం లేదని ఆరోపిస్తూ చంద్రశేఖర్ రాజీనామా చేశారు.ఆయనను బుజ్జగించేందుకు ఈటెల రాజేందర్ ( Eatala Rajender )ప్రయత్నించినా, చంద్రశేఖర్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఇష్టపడలేదు.పార్టీని వీడి వెళ్లే విషయంలో మరొకసారి పునరాలోచన లేదని చంద్రశేఖర్ ప్రకటించారు.

ఆయన బిజెపిని వీడి కాంగ్రెస్( Congress PARTY ) లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఈ మేరకు త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం.చంద్రశేఖర్ గతంలో తెలుగుదేశం, బీఆర్ఎస్,( BRS party )  కాంగ్రెస్ లో కీలకంగా పనిచేశారు.

మూడేళ్ల క్రితం బిజెపిలో చేరారు.బిజెపిలో చేరినా,  తన స్థాయికి తగ్గ గౌరవం లభించడం లేదనే అసంతృప్తితో ఉంటున్నారు .1985 నుంచి 2008 వరకు ఐదు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ గెలిచారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి అసెంబ్లీకి,  2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన,  ఆ రెండు ఎన్నికల్లోను ఓటమి చెందారు.

Telugu Brs, Chandra Shekhar, Congress, Eatala Rajender, Telangana-Politics

 ఇక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరారు.అక్కడా ఆయనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో , మళ్లీ కాంగ్రెస్ వైపు చంద్రశేఖర్ మొగ్గు చూపుతున్నారట.భారీ అనుచరుగణంతో త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు చంద్రశేఖర్ సిద్ధమవుతున్నారట.ఎన్నికల సమయంలో పార్టీలోకి చేరికలు లేకపోగా,  ఉన్న నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీలోకి వెళ్ళిపోతూ ఉండడం తెలంగాణ బీజేపీలో ఆందోళన కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube