కేసీఆర్ కథనరంగంలోకి దిగిపోయారు.ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో స్పీడ్ పెంచారు.
ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే అంశంపై ఎక్కువగా ఫోకస్ చేసిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా బీఆర్ఎస్( BRS party ) ప్రభావాన్ని పెంచే విధంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
దీనిలో భాగంగానే పూర్తిగా ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉంటున్న కేసీఆర్, ఇక జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కు సంబంధించి అనేక సర్వేలు చేస్తున్న కేసీఆర్ ప్రజలను నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని సర్వేల ద్వారా తెలుసుకుంటున్న కేసీఆర్ ( CM KCR )వాటికి సంబంధించిన హామీలను ఇచ్చేందుకు నేరుగా ప్రజలను కలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ఆగస్టు చివరివారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అలాగే ఆ పర్యటనలోని భారీ బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు.ఈ సభల ద్వారా ఎన్నికల వాతావరణం సృష్టించేందుకు కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈనెల చివరివారంలో మెదక్ జిల్లా సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు, అనేక బహిరంగ సభలో పాల్గొనేందుకు కేసిఆర్ సర్వం సిద్ధం చేసుకున్నారు .అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, బహిరంగ సభల ద్వారా కాంగ్రెస్ ) Congress ) బీజేపీ( BJP party ) లపై విమర్శలతో విరుచుకుపడేందుకు అన్ని ఆస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.ఆగస్టు 19 మెదక్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని , ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
ఆగస్టు 20న సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు ఈ పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, అనంతరం కొత్తగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు.
అలాగే నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని కెసిఆర్ ప్రారంభించనున్నారు.నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు .అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ , బీఆర్ఎస్ పట్టు పెంచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.