యాంకర్: శ్రీశైలం డ్యామ్( Srisailam Dam ) కి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది ఎగువ పరివాహక ప్రాంతాల అయినా జూరాల, సుంకేసుల నుంచి కృష్ణమ్మ పొరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి 78 వేల 837 క్యూసెక్కులు డ్యామ్ కి చేరుకుంటుంది,డ్యాం జళకళ సంతరించుకుంటుంది శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 863.80 అడుగులుగా ఉంది,శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 115.5020 టీఎంసీలుగా నమోదయింది.
డ్యాముకు 862 అడుగులు రావడంతో తెలంగాణ ఆంధ్ర కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉన్నారు విద్యుత్ ఉత్పత్తి ద్వారా అవుట్ ఫ్లో 19.070 క్యూసెక్కుల వరద నీరును దిగువ నాగార్జునసాగర్( Nagarjuna Sagar ) కి వదులుతున్నారు గడిచిన 24 గంటల్లో ఏపీ విద్యుత్ కేంద్రం ద్వారా 0.308 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేశారు, తెలంగాణ ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 6.873 మిలియన్ యూనిట్ల విద్యుత్పత్తిని చేశారు….