బ్రో మూవీ( Bro movie ) విడుదల అయ్యాక అందరు పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నారు.సినిమాలో మొత్తం పవన్ కళ్యాణ్ నామ స్మరణ చేయడానికే అన్నట్టుగా ఉంది అంటూ సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
ఎంత కాదన్న సాయి ధరమ్ తేజ్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ మానియా పెద్దదే కానీ అసలు ఈ సినిమాకు హీరో ఎవరు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.సముద్రఖని దర్శకత్వం లో తమిళ్ లో తీసిన వినోదయ సీతం సినిమాలో దేవుడి పాత్రలో నటించిన సముద్రఖని పాత్ర ఒక అతిధి పాత్రగానే ఉంటుంది.
అందులో పరశురామ్ పాత్రలో నటించిన తంబీ రామయ్య( Thambi Ramaiah ) 60 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిగా కనిపించి కుటుంబ కథ చిత్రంగా ఈ సినిమా కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.
కానీ తెలుగులోకి వచ్చే సరికి స్టోరీ లైన్ అలాగే ఉంచి మిగతా అన్ని విషయాలు తమకు నచ్చినట్టుగా త్రివిక్రమ్( Trivikram ) డెవలప్ చేసాడు.కమర్షియల్ గా హైలెట్స్ పెరిగాయి.సముద్రఖని పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి విపరీతంగా పెరిగింది.
అసలు కథకు సూత్రధారుడు మరియు హీరో అయినా సాయి ధరమ్ తేజ్ ని పవన్ పాత్ర చాల క్లియర్ గా డామినేట్ చేసింది.ఒక రకంగా చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ కాదు పవన్ కళ్యాణ్ హీరో అన్నట్టుగా ఈ సినిమా నడిచింది.
దీన్ని బట్టి చుస్తే పవన్ కళ్యాణ్ లేకపోతే సాయి ధరమ్ తేజ్ సోలో హిట్ కొట్టలేడు అని అందరు ఫిక్స్ అయ్యారా అని అనిపించక మానదు.ఈ ఏడాది ఇది సాయి కి రెండో సినిమా.
ఇంతకన్నా ముందు వచ్చిన విరూపాక్ష లో కూడా సాయి ధరమ్ తేజ్ పాత్ర కన్నా కూడా హీరోయిన్ సంయుక్త మీనన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండి సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది.ఈ సినిమా విజయం లో ఆమెనే కీలక పాత్ర పోషించడం తో పాటు సినిమా విజయంలో ఆమెదే పెద్ద పీట అని అనుకోవచ్చు.కథ అలా పెరిగినప్పుడు తనకు దక్కాల్సిన పాత్ర నిడివి తగ్గిపోతున్న సాయి ధరమ్ తేజ్ సైలెంట్ గా ఉండటం ఆసక్తికర విషయం.బ్రో మూవీ, విరూపాక్ష మూవీ లో పవన్ మరియయు సంయుక్త( Samyuktha Menon ) విజయానికి కారకులుగా ఉంటె ఈ రెండు సినిమాల్లో హీరో అయినా సాయి మౌనాన్ని కంటిన్యూ చేస్తూ మేకర్స్ కి సహాయం చేస్తున్నాడు.