పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బ్రో సినిమా( Bro ) వేడుకల్లో భాగంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.
తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఇతరులకు అవకాశాలు ఇవ్వాలని అప్పుడే ఇండస్ట్రీ ముందుకు వెళుతుందని తెలిపారు.అలాగే ఇతర భాషల వారిని తమిళ చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానించినప్పుడే ఎదిగే అవకాశం ఉంటుంది.
కానీ ఇలా నిబంధనలు పెట్టడం సరికాదని ఈయన పరోక్షంగా రోజా( Roja ) భర్తను ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేశారు.
రోజా భర్త సెల్వమణి ( Selvamani ) తమిళ చిత్ర పరిశ్రమకు ఇతరులని రావద్దని చెప్పలేదు కానీ తమిళ సినిమాల కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయాలని ఆయన కోరారు.అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ కార్మికుల కోసమే చేశారు అంటూ రోజా భర్తకు నటుడు నాజర్( Nassar ) మద్దతు పలుకుతూ కామెంట్ చేశారు.తమిళ పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది.
అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని ఖండిస్తాను.దాన్ని వ్యతిరేకిస్తాను.
సినిమా పరిశ్రమ, కళాకారులు అనే వాళ్లకు సరిహద్దులు ఉండవని తెలిపారు.ఇక ఈ విషయం గురించి ఎవరో తప్పుగా ప్రచారం చేస్తూనా సోదరుడు పవన్ కళ్యాణ్ కి కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ ఈయన తమిళ చిత్ర పరిశ్రమ గురించి వస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నాజర్ తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటిస్తూ విలన్ గా, నటుడిగా నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.