హీరోల రెమ్యూనరేషన్ విషయంపై గతంలో చాలామంది హీరోయిన్లు దర్శక నిర్మాతలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ముఖ్యంగా హీరోయిన్లు సినిమా ప్రమోషన్స్ విషయంలో, హీరోల రెమ్యూనరేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇది ఉండే తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి( MP Vijayasai Reddy ) కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో వైసీపీ రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కీలక సూచనలు చేశారు.
దీనికి సంబంధించిన చర్చ రాజ్యసభలో జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.
సినిమాలకు అయ్యే బడ్జెట్లో అధిక భాగం హీరోల రెమ్యూనరేషన్ లే అని ఆయన వెల్లడించారు.ముఖ్యంగా సల్మాన్ ఖాన్( Salman Khan ) లాంటి బడా హీరోలు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు.భారతీయ చలన చిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు కానీ బడ్జెట్లో మూడో వంతు బడ్జెట్ హీరోలు ఇతర అగ్రనటుల పారితోషకాలకే సరిపోతున్నాయని అన్నారు.
ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభలో సినిమాటో గ్రఫి మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు( Anurag Thakur ) విజయసాయి రెడ్డి సూచించారు.ఇక సినిమా కోసం కష్టపడి పనిచేసే కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలు ఇచ్చి సరిపెడుతున్నారని ఆయన అన్నారు.
సినిమా అంటే హీరో ఒక్కడే కాదని స్పష్టం చేసిన ఆయన బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని, ఈ మేరకు కేంద్ర సినిమాటో గ్రఫీ చట్టాన్ని బలోపేతం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని వెల్లడించారు.హీరోల కొడుకులే ఎందుకు హీరోలు అవుతున్నారు అని ప్రశ్నించిన ఆయన దేశంలో ఎంతో మంది టాలెంట్ కలిగిన వారు ఉన్నారని ఆయన కామెంట్ చేశారు.హీరోల కుమారులే హీరోలు అవుతున్నారు.కానీ హీరోల కుమార్తెలు మాత్రం హీరోయిన్ లు అవుతున్న ఉదంతాలు చాలా తక్కువ ఉన్నాయని విజయ సాయిరెడ్డి అన్నారు.హీరోలు అయ్యే హీరోల కుమారుల కంటే అందగాళ్ళయిన అబ్బాయిలు దేశంలో లెక్కకు మించి ఉన్నా, టాలెంట్ ఉన్నవారు ఉన్నా వారికి హీరోగా అవకాశాలు ఎందుకు దక్కడం లేదో అర్థం కావడం లేదని అన్నారు.చైనా కంటే ఎక్కువ జనాభా మన దగ్గర ఉన్నారు కానీ అక్కడ 80 వేల థియేటర్లు ఉంటే భారత్‌లో మాత్రం 8 వేల థియేటర్లు మాత్రమే ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు.
అంతేకాదు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ పొందిన సినీ నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.