ఇదేందయ్యా ఇది: ఆల్రెడీ వాడేసిన ఇన్నర్స్ అమ్ముతూ ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్న మహిళలు..!

బ్రతకడానికి వెయ్యి మార్గాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు.అది నిజమేనని దీనిని బట్టి చూస్తే తెలుస్తుంది.

 British Women Selling Their Used Underwears To Make Extra Money Details, Viral N-TeluguStop.com

రోడ్లపై చెత్త ఏరుకునేవారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం.కాగితాలు, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తూ ఉంటారు.

ఈ చెత్త వస్తువులను అమ్ముకోవడం వల్ల వారికి డబ్బులు వస్తాయి.దీని వల్ల వారి రోజువారీ జీవనానికి ఇబ్బంది ఉండదు.

ఈ చెత్త వస్తువులను రీసైక్లింగ్ చేసి వేరే వేరే వస్తువులను తయారుచేస్తూ ఉంటారు.తాజాగా వాడి పడేసిన అండర్ వేర్లను( Underwear ) అమ్మేసి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు లండన్‌లోని( London ) కొంతమంది మహిళలు.

Telugu British, Ways, Extra, Latest, Underwears, Wears-Latest News - Telugu

బ్రిటన్‌లోని కొంతమంది మహిళలు వాళ్లు వాడుకున్న అండర్ వేర్లు, సాక్సులను విక్రయిస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.డైలీ స్టార్ నివేదికలో ప్రముఖ సెక్స్ థెరపిస్ట్ మెలిసా కుక్( Melissa Cook ) ఈ విషయం వెల్లడించారు.మహిళలు తమ లోదుస్తులు అమ్ముతూ నెలకు రూ.30 వేల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయిస్తున్నారు.అండర్‌వేర్లతో పాటు సాక్సులు, బ్రాలు, షార్ట్ లు లాంటి లోదుస్తులను అమ్ముకుంటున్నారు.

వీటిని కొనుగోలు చేసేవారు కూడా చాలామంది ఉన్నారని, వీటికి మంచి గిరాకీ కూడా ఉందని మెలిసా కుక్ చెబుతున్నారు.

Telugu British, Ways, Extra, Latest, Underwears, Wears-Latest News - Telugu

బ్రిటన్ మహిళలు( Britain Women ) ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం అండర్ వేర్లు, బ్రాలు, సాక్సులు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.ఆన్ లైన్ కంటెంట్ సెల్లింగ్ వెబ్‌సైట్లలో వీటిని అమ్ముతూ బోల్డెంత సంపాదిస్తున్నారు.కంటెంట్ సెల్లింగ్ సైట్లలో ఇలాంటివి కొనేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

నార్త్ కరోలినాలోని ఒక మహిళ అయితే చివరికి గోళ్లు, తల్లో చుండ్రు, నోట్లో ఉమ్మి.బాడీ మీది వెంట్రుకలు కూడా ఆన్‌లైన్‌లో అమ్ముతూ ఆదాయం పొందుతోంది.

ఇక ఆరిజోనాలోని జానస్ అనే మహిళ కాళ్ల ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి లక్షల్లో సంపాదిస్తుంది.వాటిని లక్షల మంది యువకులు కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube