పొత్తులపై ఆప్షన్లు వెతుక్కుంటున్న బాబు ! 

రాబోయే ఏపీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు పొత్తులే కీలకం కావడంతో విపక్ష పార్టీలన్నీ పొత్తులపైనే దృష్టి సారించాయి.ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తు కొనసాగిస్తుండగా ,  టిడిపి మాత్రం ఈ విషయంలో గందరగోళంలో ఉంది.

 Babu Is Looking For Options On Alliances, Chandrababu, Jagan, Ap Cm Jagan, Ysr-TeluguStop.com

బిజెపి( BJP party ), జనసేన( JanaSena Party )తో కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయాలని టిడిపి చూస్తోంది.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అదే కోరుకుంటున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Tdpjanasena, Ysrcp-Politics

కానీ బిజెపి పెద్దల నుంచి మాత్రం దీనికి గ్రీన్ సిగ్నల్ పడడం లేదు.అసలు చంద్రబాబు( Chandrababu )తో పొత్తు పెట్టుకోవడం అంటే, అది బిజెపి గ్రాఫ్ తగ్గించుకోవడమే అన్న భావంలో ఆ పార్టీ అగ్ర నేతలు ఉన్నారు.అంతేకాకుండా గతంలో టిడిపితో పొత్తు ఉన్న సమయంలోను, ఆ తరువాత చంద్రబాబు , ఆ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరును ఇప్పటికి కేంద్ర బీజేపీ పెద్దలు ఎవరు మర్చిపోవడం లేదు.అయితే వైసిపిని( YCP Party ) ఓడించాలంటే కచ్చితంగా టిడిపిని కలుపుకు వెళ్లాలని పదేపదే బిజెపి అధిష్టానం పెద్దల వద్ద పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తున్నారుఈ విషయం ఇంకా పెండింగ్ లోనే ఉంది.

ఎన్నికల నాటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అర్థమవుతుంది.అయితే చంద్రబాబు ఈ విషయంలో రెండు ఆప్షన్లను వెతుక్కుంటున్నారు. 

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Tdpjanasena, Ysrcp-Politics

ఎన్నికల సమయం నాటికైనా ఏదో రకంగా బిజెపి, జనసేనతో పొత్తు పెట్టుకోవాలని, అల కుదరని పక్షంలో జనసేనతోనే పొత్తు పెట్టుకుని బిజెపిని పక్కన పెట్టే విధంగా పవన్ ను ఒప్పించాలని చూస్తున్నారు.ఇక మరో ఆప్షన్ గా వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనేది చంద్రబాబు చూస్తున్నారు. బిజెపి, జనసేనతో పొత్తు విషయంలో త్వరలో క్లారిటీకి రాబోతుంది .ఇక మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు.ఈ సందర్భంగా పొత్తుల అంశంపై వీరిద్దరూ కీలకం గా చర్చించబోతున్నారు.ఈ భేటీ తరువాత ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube