ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఎందుకంటే ఎట్టకేలకు ప్రభాస్ ( Prabhas )అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన అప్డేట్ రానే వచ్చింది.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ”ప్రాజెక్ట్ కే”( Project K )పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అంతేకాదు ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్,( Amitabh Bachchan ) దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఈగర్ గా అన్ని ఇండస్ట్రీల వారు ఎదురు చూసేలా చేస్తున్నారు.మరి వీరి ఎదురు చూపులకు సాలిడ్ అప్డేట్ తో నాగ్ అశ్విన్ ఇచ్చిన ప్రాజెక్ట్ కే అప్డేట్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.ప్రాజెక్ట్ కే నుండి టైటిల్ అండ్ గ్లింప్స్ కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మరి ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి ఈ అప్డేట్ వచ్చింది.శాన్ డియాగో కామిక్ కాన్ లో అట్టహాసంగా ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.ఈ సినిమాకు ”కల్కి’( Kalki ) అనే టైటిల్ ను ప్రకటించారు.అలాగే గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అదిరిపోయే సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది.
బాహుబలి 2 కంటే మించిన హిట్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు.అయితే అంతా బాగుంది కానీ ఈ సినిమా విషయంలో మేకర్స్ మరో విషయాన్నీ ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు.
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది అని ఎప్పుడో ప్రకటించారు.కానీ తాజాగా ఇచ్చిన అప్డేట్ లో రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
జనవరి 12న రిలీజ్ అని టైటిల్ గ్లింప్స్ లో వేయక పోవడంతో మళ్ళీ రిలీజ్ వాయిదా పడుతుందేమో అని అంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.