తీగ జాతి మొక్కలలో సోయాబీన్( Soybean ) కూడా ఒకటి.ఇందులో ఎన్నో పోషకాలు ఉండడంవల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఈ సోయాబీన్ కు కాండం కుళ్ళు తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి అరికడితే మంచి దిగుబడి పొందవచ్చు.
ఈ తెగులు ఒక ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది.ఫంగస్ పంట మొక్కల అవశేషాలలో, భూమిలో ఎన్నో సంవత్సరాల పాటు జీవించే ఉంటుంది.
ఇవి మొక్కల ఆకుల కణజాలాన్ని ఆక్రమించి నివాసాలను ఏర్పరచుకొని మొత్తం వ్యాపిస్తాయి.ఇది విత్తనాల లోపల ప్రవేశించి నివాసాలను ఏర్పాటు చేసుకుంటుంది.
ఈమధ్య మార్కెట్లో నకిలీ విత్తనాల దందా కాస్త ఎక్కువగానే ఉంది.కాబట్టి సర్టిఫైడ్ కంపెనీలకు పొందిన తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.గతంలో వేసిన పంటలో ఈ కుళ్ళు తెగులు ఉన్నట్లయితే పంటను మార్చి వేరే పంటను సాగు చేయాలి.సోయాబీన్ మొక్కలు కిందికి వాలకుండా కర్రల సహాయంతో మొక్కలను కట్టాలి.
ఇతర పంట అవశేషాలను, కలుపు మొక్కలను కనిపించిన వెంటనే తీసేయాలి.ముఖ్యంగా మొక్కలు ఎదిగే చివరి దశలో అధికంగా ఎరువులు వాడకూడదు.
మొక్కలపై నీటితో తడిచినట్టు ఉండే ఉబ్బిన మచ్చలు కనిపిస్తే ఈ తెగులు సోకినట్లు నిర్ధారించుకోవాలి.ఈ తెగుల లక్షణాలు కాండం, ఆకులు, కాయలపై గమనించవచ్చు.ఈ తెగులను సేంద్రీయ పద్ధతి( Organic method )లో నివారించాలంటే ఫంగల్ పరాన్నజీవి కొయోథైరియం మినిటాన్స్ అతుల మొక్కల యొక్క రేనుగుల సూత్రీకరణలు ఈ తెగులను తగ్గించడానికి దోహదపడతాయి.రసాయన పద్ధతిలో ఈ తెగులను నివారించాలంటే ఇప్రోడియన్( Iprodion ) లేదా కాపర్ ఆధారిత శిలీంద్రా నాశినినులను మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తే ఈ తెగుల నుండి పంటను సంరక్షించుకోవచ్చు.