ఆపిల్ వాచ్ ఆర్డర్ పెట్టింది.. ఆమెకు ఏం వచ్చిందంటే..?

ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఒకటి ఆర్డర్ పెడితే మరొకటి వస్తూ ఉంటుంది.ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకుంటూ ఉంటాయి.

 She Ordered An Apple Watch What Did She Get , Apple Watch Tech News, Online Shop-TeluguStop.com

అలాగే మనం ఎంచుకున్న డిజైన్, కలర్, మోడల్ గల వస్తువు కాకుండా వేరే కలర్ కలిగిన వస్తువులను పంపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి.ఇలాంటప్పుడు చాలామంది రిటర్న్ పెడతారు.

దీంతో డెలివరీ బాయ్ ఆ వస్తువును తిరిగి పంపిస్తే మనం ఆర్డర్ చేసుకున్న వస్తువును కరెక్ట్ గా పంపిస్తారు.ఆన్‌లైన్ ఆర్డర్లలో తమకు ఎదురైన చేదు అనుభవాలను కొంతమంది సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా ఒక యువతి ఆపిల్ వాచ్‌ను( Apple Watch ) ఆర్డర్ పెట్టింది.కానీ ఆమెకు ఆపిల్ వాచ్ కాకుండా ఫేక్ వాచ్ వచ్చింది.దీంతో ఆమె కస్టమర్ కేర్ కి కాల్ చేసింది.అయినా లాభం లేకపోవడంతో ఆమె తన ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది.యాపిల్ సిరీస్-8 వాచ్( Apple Watch Series-8 ) ను అమెజాన్ వెబ్ సైట్ ( Amazon website )నుంచి జులై 8న యువతి బుక్ చేసింది.9వ తేదీన డెలివరీ ఇంటికి రాగా ఓపెన్ చేసి చూసి షాక్ అయింది.ఆపిల్ వాచ్ స్థానంలో ఫిట్ లైఫ్ వాచ్ వచ్చింది.దీంతో వెంటనే కస్టమర్ కేర్ కి ఫోన్ చేసినా సాయం అందలేదు.దీంతో అమెజాన్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేసింది.సాధ్యమైనంత వరకు తన సమస్యకు పరిష్కారం చూపాలి అని స్పష్టం చేసింది.

అయితే యువతి ట్వీట్ పై అమెజాన్ స్పందించింది.అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కరించి మీ ప్రొడక్ట్ ను డెలివరీ చేస్తామని తెలిపింది.మీ ఆర్డర్ వివరాలను మాకు వ్యక్తిగతంగా మెసేజ్ రూపంలో పెట్టాలని సూచించింది.ఈ పోస్ట్ కు క్షణాల్లోనే 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube