టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 77కు చేరింది.
విచారణలో భాగంగా నిందితుడు పోల రమేశ్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాన్ని 30 మందికి విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే పోల రమేశ్ ఇచ్చిన సమాచారంతో మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ కేసు వ్యవహారంపై సుమారు ఐదు ప్రత్యేక బృందాలతో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.చైన్ సిస్టమ్ తరహాలో ప్రశ్నాపత్రాలు అమ్మినట్లు సిట్ గుర్తించింది.
తాజాగా అరెస్ట్ అయిన 13 మంది నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.