మలయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ( Bro Daddy ) ని తెలుగు లో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు మొదలు అయ్యాయి అంటూ వార్తలు వచ్చాయి.
సోగ్గాడే చిన్నినాయన సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeev ) హీరోగా ఈ రీమేక్ రూపొందబోతుంది అంటూ మెగా కాంపౌండ్ నుండి అధికారికంగా వార్తలు వచ్చాయి.కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ ఈ రీమేక్ గురించి క్లారిటీ ఇవ్వలేదు.
ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.హీరోయిన్స్ గా త్రిష మరియు శ్రీలీల నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
నటీనటుల ఎంపిక కన్ఫర్మ్ అయింది.ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
కనుక ఏ క్షణంలోనైనా సినిమా పట్టాలెకే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతుంది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చే నెల ఉంది.కనుక ఆ రోజున ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయినట్లుగా ఇటీవల దర్శకుడు మెహర్ రమేష్ ప్రకటించాడు.
కనుక మెగాస్టార్ చిరంజీవి ఇకపై ఈ రీమేక్ పనులపై పడే అవకాశం ఉందని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.చిరంజీవి మరియు సిద్దు జొన్నలగడ్డ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమా లో చిరంజీవికి జోడిగా త్రిష నటించడం వల్ల కూడా అంచనాలు భారీగా పెరగబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదలయితే బాగుంటుందని కొందరు అభిప్రాయం చేస్తున్నారు… లేదు సంక్రాంతి కి వస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి బ్రో డాడీ ఎప్పుడొస్తుందనేది తెలియాలంటే మొదట షూటింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది.