గంజాయి తినేసిన ఎలుకలు.. ఈ నేరస్తులు ఎలా తప్పించుకున్నారంటే..?

తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నేరస్తులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.సాక్షులను ప్రభావితం చేయడం, జరిగిన దాన్ని వేరేలా క్రియేట్ చేసి చెప్పడం, సాక్ష్యాలను తారుమారు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

 Rats Eat Up 22 Kg Of Ganja In Store House Two Acquitted Details, Rats , Latest N-TeluguStop.com

ఇలా తాము తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అనేక ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ ఉంటాయి.తాజాగా కొంతమంది నేరస్తులు ఎలుకల వల్ల బయటపడ్డారు.

చెన్నైలో( Chennai ) ఈ ఘటన చోటుచేసుకుంది.

Telugu Kg Ganja, Cannabis, Chennai, Criminals, Escape, Latest, Nageswara Rao, Ra

తమిళనాడులోని మెరినీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజగోపాల్, నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు బీచ్ పరిసరాల్లో గంజాయి( Cannabis ) అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు.పోలీసులు వారిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.వాళ్ల నుంచి మొత్తం 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని స్టోర్‌హౌస్‌లో పోలీసులు దాచిపెట్టారు.2020లో ఈ ఘటన జరిగింది.వారిని రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచారు.అయితే ఇటీవల నిందితులపై కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

Telugu Kg Ganja, Cannabis, Chennai, Criminals, Escape, Latest, Nageswara Rao, Ra

మంగళవారం స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది.ఈ సందర్బంగా కోర్టు సాక్ష్యాధారాలను సమర్పించాలని పోలీసులను కోరింది.అయితే గంజాయిని స్టోర్‌హౌస్‌లో దాచిపెట్టగా.ఎలుకలు( Rats ) తినేసిట్లు పోలీసులు చెప్పడంలో అందరూ ఆశ్చర్యపోయారు.సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది.దీంతో నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది.

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై కోర్టు సీరియస్ అయింది.అయితే ఈ ఒక్క కేసే కాదు.

చాలా కేసుల్లోనూ ఇలాంటివి జరిగాయి.డ్రగ్స్ లేదా గంజాయిని ఎలుకలు తినేశాయంటూ కోర్టుకు పోలీసులు చెప్పారు.

ఇప్పుడు మళ్లీ అలాంటి కేసు మరోకటి చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube