రాజన్న సిరిసిల్ల జిల్లా :బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో బిసి భవన్ సిరిసిల్ల ( Rajanna Sirisilla District )లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్(Kancharla Ravi Goud ) మాట్లాడుతూ బిసి విద్యార్థిని విద్యార్థులకు ర్యాంక్ తో సంబందం లేకుండా ఇంజనీరింగ్ విద్యార్ధులకి అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నీ విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఇంజనీరింగ్ విద్య కి 10,000 ర్యాంక్ నిబంధనను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.నిరుపేద బిసి విద్యార్థులు ఉన్నత (ఇంజనీరింగ్) విద్యకు దూరం చేసేందుకే ఈ నిబంధన అని ఏద్దేవ చేశారు.
ఇంజనీరింగ్ విద్యార్ధులకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్( Reimbursement ) ను వెంటనే అమలు చెయ్యాలని లేని పక్షంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జజుల శ్రీనివాస్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల చేస్తామని, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, నాయకులు నవీన్ కుమార్, మట్టే నరేష్ తదితరులు పాల్గోన్నారు.