శ్రీలంకకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఏనుగును వెనక్కి తీసుకున్న థాయ్‌లాండ్... కారణం ఇదే!

శ్రీలంకకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఏనుగును థాయ్‌లాండ్( Thailand ) మరలా వెనక్కి తీసుకుంది.2001లో శ్రీలంకకు థాయ్‌లాండ్ ఏనుగులను బహుమతిగా ఇచ్చింది.ఈ ఏనుగు విషయంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగిన విషయం విదితమే.దీంతో 29 ఏళ్ల ముత్తు రాజా( Muthu Raja ) అనే ఏనుగు ఆదివారం విమానంలో థాయ్‌లాండ్‌కు చేరుకుంది.

 Thailand Took Back The Elephant Given As A Gift To Sri Lanka This Is The Reason-TeluguStop.com

శ్రీలంకలోని బౌద్ధ మందిరంలో ఉన్నప్పుడు ముత్తురాజాను హింసించారనే ఆరోపణల నేపథ్యంలో దాన్ని తిరిగి తమకు ఇచ్చేయాలని థాయ్‌లాండ్ డిమాండ్ చేయగా ఈ విషయంలో థాయ్ కింగ్‌కు అధికారికంగా క్షమాపణలు చెప్పినట్లు శ్రీలంక ప్రధానమంత్రి తెలిపారు.

Telugu Elephant, Gift, International, Latest, Sri Lanka, Thailand-Telugu NRI

ముత్తు రాజా బరువు 4,000 కేజీలు.దీన్ని ప్రత్యేకంగా తయారు చేసిన స్టీల్ బోనులో ఉంచి విమానంలో చియాంగ్ మయ్‌కు తీసుకెళ్లడం జరిగింది.దాని వెంట నలుగురు థాయ్ మావట్లు, ఒక శ్రీలంక( Sri Lanka ) జూ కీపర్ కూడా వెళ్లారు.

దాని ముందు ఎడమ కాలి గాయానికి హైడ్రోథెరపీ చికిత్సను అందించనున్నారు.శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల్లో ఏనుగును చాలా పవిత్రంగా భావిస్తారు.2001లో థాయ్ రాజ కుటుంబం మూడు ఏనుగులను శ్రీలంకకు బహుమానంగా పంపగా ఇందులో ముత్తు రాజా కూడా ఒకటి.ధార్మిక కార్యక్రమాల్లో వినియోగించేందుకు వీటిని శ్రీలంకకు ఇచ్చింది.

ముత్తు రాజాను ఒక గుడి సంరక్షణలో ఉంచారు.అయితే, ముత్తు రాజాతో చెట్ల దుంగలు మోసే పని చేయించారని జంతు హక్కుల సంఘాలు ఆరోపించాయి.

Telugu Elephant, Gift, International, Latest, Sri Lanka, Thailand-Telugu NRI

అంతేకాకుండా దాని కాలికి అయిన గాయాన్ని చాలా కాలం పట్టించుకోకపోవడంతో ఆ గాయం ముదిరిపోయిందని కూడా ఆరోపించింది.ఏనుగు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై విచారణ జరిపించాలంటూ సంబంధిత అధికారులకు ఆర్‌ఏఆర్‌ఈ సంస్థ పిటిషన్ వేయగా శ్రీలంక వన్యప్రాణి మంత్రి పవిత్ర వనియారాచి( Minister Pavitra Vaniarachchi ) స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ”ముత్తురాజాను తిరిగి ఇచ్చేయాలంటూ థాయ్‌లాండ్ మొండిపట్టు పట్టింది.నిరుడు థాయ్ రాయబారి శ్రీలంక పర్యటనకు వచ్చినప్పుడు ముత్తురాజా అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు.అప్పటి నుంచి థాయ్ ఈ డిమాండ్ చేస్తోంది” అని చెప్పారు.శ్రీలంక ప్రధాని దినేశ్ గుణవర్ధన జూన్‌లో పార్లమెంట్‌లో మాట్లాడుతూ ముత్తురాజా విషయంలో థాయ్ రాజు మహా వాజిర లోంగోకోర్న్‌కు క్షమాపణలు చెప్పినట్లు కూడా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube