త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) చేస్తున్న చిత్రం గుంటూరు కారం.ఈ సినిమా పై ఊహించని రీతిలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అయిన తర్వాత టెక్నీషియన్స్, నటీనటుల విషయంలో అనూహ్యమైన గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ( Thaman )ను తీసేసారు అని మహేష్ బాబు కు థమన్ ట్యూన్స్ నచ్చలేదు అని వార్తలు పుట్టుకొచ్చాయి.
అలాగే పూజా హెగ్డేని( Pooja Hegde ) కూడా తీసేసినట్టు ప్రచారం సాగుతుంది ఈ వార్తలపై థమన్ కాస్త గట్టిగానే బదులిచ్చారు ఎవరికైనా కాలితే తమ ఇంటి దగ్గర మజ్జిగ అందిస్తున్నాము తాగొచ్చు అంటూ సెటైర్ వేశారు ఇక చిత్ర యూనిట్ సభ్యులనుంచి కూడా క్లారిటీ వచ్చింది.ఈ చిత్రానికి థమన్ వర్క్ చేస్తున్నాడని ఆయన ఎప్పటిలానే మ్యూజిక్ రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఇక హీరోయిన్ విషయం లోమాత్రం క్లారిటీ రాలేదు .పూజా కానీ చిత్ర బృందం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజా రూమర్ ఏంటంటే.
పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్‌ను( Samyukta Menon ) తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నారనేది సమాచారం మరోవైపు ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న నిర్మాత బండ్ల గణేశ్ మరో ట్వీట్ చేశారు.సినిమా ఉందా అది కూడా ఎక్కించేశావా అంటూ ఇండైరెక్ట్‌గా త్రివిక్రంపై సెటైర్ వేశాడు…ఆ తర్వాత మీడియాను ఉద్దేశించి మరో ట్వీట్ కూడా చేశారు.మార్చారు అని చెప్పింది మీరేగా దయచేసి తెలిసి తెలియని వార్తలు రాయకండి అని చెప్పుకొచ్చాడు .మొత్తం మీద గుంటూరు కారం చుట్టూ రూమర్స్ నడుస్తుండటంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ మార్పు విషయంలో క్లారిటీ ఇచ్చినట్లే హీరోయిన్ మేటర్‌లో కూడా స్పష్టత ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరి దీనిపై కూడా క్లారిటీ వస్తుందేమో చూడాలి.