యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో( Telangana Decade Celebrations ) భాగంగా నిర్వహించిన తెలంగాణ విద్యా దినోత్సవంలో నవభారత్ యూత్( Navabharat Youth )కు జిల్లా అవార్డ్ లభించింది.బుధవారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి( Gongidi Sunitha Mahender Reddy ), జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి చేతుల మీదుగా నవభారత్ యూత్ అధ్యక్షుడు సరగడ కరుణ్అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలిమెట్టు కమ్యూనిటీ మూమెంట్ పిల్లల కోసం వభారత్ యూత్ వాలంటీర్స్ కి అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారిలకు నవభారత్ యూత్ వాలంటీర్ల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.