రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట గ్రామంలోని 8 కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మ అమ్మవారికి బోనాల కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి నెత్తిన బోనాన్ని ఎత్తుకొని డప్పు చప్పులతో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి బయల్దేరారు.
అనంతరం అమ్మవారికి వివిధ పూజ కార్యక్రమాలతో ఘనంగా నైవేద్యాన్ని సమర్పించారు.ఈ సందర్బంగా శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు.
గ్రామస్తులంతా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకోని వర్షాలు బాగా కురిపించి గ్రామస్తులు, రైతులు సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు.
అయితే బోనాల కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఎంపిటిసి గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు సహకరించకపోవడంపై గ్రామస్తులు, బోనాల నిర్వాహకులు, మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామంలో కలసికట్టుగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తే గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు దూరంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు, అనంతరం బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తీగల శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి నరసయ్య, తీగల ఎల్లయ్య,నాంపల్లి శ్రీనివాస్, గొల్ల శ్రీనివాస్, గొల్ల రవి, కల్లెట్ల సురేష్, నరేష్, మనోహర్, గొర్రె మైసయ్య, సందెల సత్తయ్య, విక్కుర్తి ఎల్లయ్య, వివిధ కుల సంఘాల సభ్యులు మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.