ఉల్లి సాగులో తెల్ల కుళ్ళు తెగులును నివారించే పద్ధతులు..!

ఉల్లి పంట( ( Onion cultivation ) )ను ఆశించే తెల్ల కుళ్ళు తెగులు ( White Rot )ఒక శిలీంద్రం వల్ల వ్యాప్తి చెందుతుంది.ఈ తెగులు నేలలోనుంచి మొక్కను ఆశించి నాశనం చేస్తాయి.

 Methods To Prevent White Rot In Onion Cultivation..! Onion Cultivation , Onion-TeluguStop.com

భూమిలో ఉండే ఈ తెగులకు సంబంధించిన శిలీంద్రాలను అరికట్టడం చాలా కష్టం.ఉల్లికి తీవ్ర నష్టం కలిగించే తెగులలో ఈ తెల్ల కుళ్ళు తెగులు కీలకపాత్ర పోషిస్తాయి.

నీరు, పనిముట్ల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతాయి.

ఉల్లి మొక్క ఆకుల యొక్క పై అంచులు పసుపు రంగులోకి మారి వాలిపోతే ఈ తెల్ల కుళ్ళు తెగుళ్లు సోకినట్లు నిర్ధారించుకోవాలి.

అంతేకాకుండా మొక్కల మొదల వద్ద నల్లని మచ్చలు ఏర్పడి, దూది లాంటి తెల్లని శిలీంద్రం అక్కడ పెరగడం గమనించవచ్చు.తరువాత క్రమంగా వేర్లతో సహా మొక్క కుళ్ళిపోయి, ఉల్లిగడ్డలు క్షీణిస్తాయి.

ముఖ్యంగా గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే పంట ఏ దశలో ఉన్న కూడా ఈ తెగులు సంక్రమించే అవకాశం ఉంది.కాకపోతే ఈ తెగుల లక్షణాలు మొక్క పైనుంచి కిందికి పాకి ఉల్లిగడ్డను కుళ్ళింప చేస్తాయి.

Telugu Agriculture, Farmers, Sunshine, White Rot-Latest News - Telugu

ఉల్లిగడ్డ మొక్కలలో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే పీకి పంట నుండి వేరు చేయాలి.వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల భూమిలో ఉండే ఈ తెగులకు సంబంధించిన శిలింద్రాలు దాదాపుగా సూర్యరశ్మి(Sunshine )కి నాశనం అవుతాయి.తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని నాటుకోవాలి.

Telugu Agriculture, Farmers, Sunshine, White Rot-Latest News - Telugu

ఇక తొలిదశలోనే రసాయన మందులను ఉపయోగించి నివారణ చర్యలు చేపట్టాలి.టేబుకొనేజోల్, పెందాయోపైరాడ్, ప్లూడియోక్సోనిల్, ఇప్రొడియోన్ లాంటి వాటిని ఉల్లినారు నాటడం కంటే ముందే నేలలో వేస్తే ఈ తెగులు వచ్చే అవకాశం ఉండదు.ఒకవేళ పంట వేశాక ఈ తెగుల లక్షణాలు కనిపిస్తే ఈ రసాయన మందులనే ఉపయోగించి పిచికారి చేసి వెంటనే నివారించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube