విస్తరిస్తున్న డ్రోన్ సేద్యం...

బి అర్ ఎస్ రాష్ట్ర నాయకులు జోగినప ల్లి రవీందర్ రావుతో కలిసి డ్రోన్ యంత్రం ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్( Sunke RaviShankar MLA ).రాజన్న సిరిసిల్ల జిల్లా: వ్యవసాయంలో 20 ఏండ్ల క్రితం వరి కోత మిషన్లను వినియోగించినప్పుడు అనేక మంది పెదవి విరిచారు.ఇప్పుడు వరికోత మిషన్‌ లేకుండా వరి పంట లేని పరిస్థితి వచ్చింది.అదే విధంగా రెండు, మూడేళ్ల క్రితం వ్యవసాయ రంగంలోకి పురుగుమందుల పిచికారీ కోసం ప్రవేశించిన డ్రోన్‌ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తున్నది.

 The Expanding Drone Farming…-TeluguStop.com

ఇప్పుడు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రోన్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో అనేక గ్రామాల్లో రైతులు మక్క ఇతర పంటల్లో డ్రోన్ల సహాయంతో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు.

బోయినిపల్లి మండల కేంద్రం లోని రైతు డ్రోన్ కొనుగోలు చేయగా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు తో కలిసి దానిని ట్రయల్ రన్ చేసి ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచేందుకు ఇటు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ సంస్థలు కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, దీంతో డ్రోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నారని, కొందరు ఔత్సాహిక దళిత రైతులు కూడా దళితబంధు పథకంలో డ్రోన్లను కొనుగోలు చేసి, కిరాయికి నడుపుతూ ఉపాధి పొందుతున్నారున్నారు.

డ్రోన్‌ను( Drone ) వినియోగించి పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల బహుళ ప్రయోజనాలు కనిపించడంతో దీన్ని వాడేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఎకరాలకు డ్రోన్‌ ద్వారా మందును స్ప్రే చేయవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమం లో బి అర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు జోగినపల్లి రవీందర్ రావు,ఎంపిపి పర్లపల్లి వేణు గోపాల్,జెడ్పీటీసీ కత్తెర పాక ఉమా కొండయ్య, వైస్ ఎంపిపి కొనుకటి నాగయ్య జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్,రైతు సమితి అధ్యక్షులు కోనుకటి లచ్చి రెడ్డి,మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి,సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బి అర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య,సింగిల్ విండో చైర్మన్ ల జిల్లా అధ్యక్షులు తీపిరెడ్డి కిషన్ రెడ్డి,మానువడ సింగిల్ విండో అధ్యక్షులు వేసి రెడ్డి దుర్గ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు,కో ఆప్షన్ అజ్జూ,సర్పంచ్ గుంటి లతా శ్రీ,ఎంపిటిసి సంబ బుచ్చమ్మ, వ్యవసాయ అధికారిని ప్రణీత,ఆయా గ్రామాల సర్పంచ్ లు ,ఎంపిటిసి లు,నాయకులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube