ఓఆర్ఆర్ లీజు వ్యవహారంలో లీగల్ నోటీసుకు రేవంత్ సమాధానం

ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంలో లీగల్ నోటీసుకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.ఈ నేపథ్యంలో అరవింద్ పంపిన లీగల్ నోటీస్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

 Revanth's Reply To Legal Notice In Orr Lease Matter-TeluguStop.com

బీఆర్ఎస్ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే లీగల్ నోటీసు ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.లీగల్ నోటీసులో పేర్కొన్న ఆరోపణలు అన్నీ బూటకమన్నారు.

అరవింద్ కుమార్ రాజకీయ నాయకుడిలా వ్యవహారిస్తున్నారని విమర్శించారు.సమాచారం ఇవ్వకుండా ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.7,380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు.అయితే ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube