పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ఆదిపురుష్( Adipurush ).దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఓం రౌత్( Om Raut ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా మరొక మూడు రోజుల్లో అనగా జూన్ 16న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా తెలుగు హక్కులు హోల్ సేల్ గా భారీ రేట్లకు అమ్ముడుపోయాయి.

ఆపై రిటైల్ గా కూడా అదే రేంజ్ లో అమ్ముడుపోయాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు కళ్ల చూడాల్సి వుంది.అయితే ఆదిపురుష్ సినిమాకి కలిసొచ్చే విషయం ఏమిటంటే.
విరూపాక్ష మూవీ తరువాత ఇప్పటి వరకు సరైన సినిమా పడలేదు.థియేటర్లు అన్నీ లాస్ ల్లో నడుస్తున్నాయి.
దాంతో ఆదిపురుష్ మూవీ మా థియేటర్లో వేయండి అంటే మా థియేటర్లో వేయండి అని ఎగ్జిబిటర్లు వెంటపడుతున్నారు.అందువల్ల ఎగ్జిబిటర్ అడ్వాన్స్ లకు పెద్దగా సమస్య కాదు.
అలాగే థియేటర్లకు అంతకన్నా సమస్య కాదు.

కావాల్సిననన్ని థియేటర్లు వేసుకోవచ్చు.ఆంధ్రలో దాదాపు మాగ్జిమమ్ థియేటర్లలో ఆదిపురుష్ ను విడుదల చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోంది.అలాగే 50 రూపాయల అదనపు రేటు కూడా దాదాపు వచ్చినట్లే.
ఆంధ్ర ప్రభుత్వం వైపు నుంచి అంగీకారం కూడా లభించింది.జీవో రావాల్సి వుంది.
వీలయినన్ని థియేటర్లలో, అదనపు రేట్లతో ప్రదర్శించడం ద్వారా మొదటి మూడు రోజుల్లో మాగ్జిమమ్ వసూళ్లు రాబట్టడం అన్నది ప్లానింగ్ గా కనిపిస్తోంది.కాగా తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి 50 నుంచి అరవై కోట్ల వసూళ్లు సాధిస్తే, ఫస్ట్ వీకెండ్ లో టోటల్ టార్గెట్ లో సగానికి సగం సాధించవచ్చని లెక్కలు కడుతున్నారు మూవీ మేకర్స్.
సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ వ్యూహాలు అన్నీ ఫలించి, మంచి ఫలితాలు నమోదు చేసే అవకాశం వుంది.విడుదలకు ముందే భారీగా అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదల అయ్యి ఎటువంటి ఫలితాలను కాపాడుతుందో చూడాలి మరి.ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.







