మోడీని చూడాలని.. మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి జర్నీ , 91 ఏళ్ల వయసులో భారత సంతతి బామ్మ సాహసం

ప్రధాని నరేంద్ర మోడీకి( Narendra Modi ) భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే.ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయంగా భారత్ ( India )పలుకుబడి పెరుగుతోంది.

 Australia At 91, Indian-origin Woman Travels Melbourne To Sydney Just To Greet-TeluguStop.com

దీనికి తోడు మనదేశం అభివృద్ధిలో దూసుకెళ్తూ వుండటంతో అన్ని దేశాలు మోడీతో మెరుగైన సంబంధాలు కోరుకుంటున్నాయి.ఇక విదేశీ పర్యటనల సందర్భగా మోడీ ఖచ్చితంగా ఆయా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులను కలిసే వస్తారు.

ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా( Australia ) పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం సిడ్నీకి చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.

ఈ క్రమంలో భారతీయ కమ్యూనిటీ మోడీకి స్వాగతం పలికింది.ఈ సందర్భంగా 91 ఏళ్ల డాక్టర్ నవమణి చంద్రబోస్( Navamani Chandra Bose ) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

మోడీ అంటే ఆమెకు ఎంతో అభిమానం.ఈ క్రమంలోనే ఆయన ఆస్ట్రేలియా వస్తున్న సంగతిని తెలుసుకున్న పెద్దావిడ.

వయసును కూడా లెక్క చేయకుండా మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వెళ్లి ప్రధానిని కలిశారు.

Telugu Australia, Diaspora, Navamanichandra-Telugu NRI

సిడ్నీలో ఈ రోజు జరగనున్న కమ్యూనిటీ ఈవెంట్ కోసం మెల్‌బోర్న్ నుంచి భారతీయులతో కూడిన ప్రత్యేక విమానంలో ఆమె ప్రయాణించారు.దీనికి సంబంధించిన వీడియోను సిడ్నీలో ఈవెంట్‌ను నిర్వహిస్తున్న ఇండియన్ ఆస్ట్రేలియన్ డయాస్పోరా ఫౌండేషన్( Diaspora Foundation ) ట్వీట్ చేసింది.ఈ సందర్భంగా ప్రయాణీకులు భారత త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ డ్యాన్స్‌లు చేశారు.

ఆస్ట్రేలియా టుడే నివేదిక ప్రకారం.మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి ప్రత్యేకంగా ‘‘ మోడీ ఎయిర్‌వేస్’’ పేరిట ఏర్పాటు చేసిన విమానంలో దాదాపు 177 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు.

వీరిలో 91 ఏళ్ల నవమణి చంద్రబోస్ కూడా వున్నారు.డాక్టర్ నవమణి 1991 నుంచి 1992 వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా వున్న ఎన్ఎస్ చంద్రబోస్ సతీమణి.1995 నుంచి 1997 వరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు.

Telugu Australia, Diaspora, Navamanichandra-Telugu NRI

ఇకపోతే.2014 తర్వాత ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇది రెండోసారి.తాజా పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో( Anthony Albanese ) మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.

దీనితో పాటు సమగ్ర ఆర్ధిక సహకార ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube