తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్న పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా

తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని వెళ్లి తిరుమల దర్శనాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పర్యాటక యువజన క్రీడా శాఖ మాత్యులు శ్రీమతి ఆర్కే రోజా అన్నారు.సోమవారం రాత్రి తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

 Tourism And Culture Minister Rk Roja Visited Thathayya Gunta Gangamma Temple ,-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తాను ఇక్కడ పాఠశాలలో చదువుకునేటప్పుడు గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని వెళ్లే వారని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పర్యాటక క్రీడల సాంస్కృతిక శాఖ మంత్రిగా అనేక దేవాలయాల్లో దేవతలను సందర్శించుకునే అవకాశం కలిగిందని వారికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

ఐదవ రోజు తాతయ్య గుంట గంగమ్మ కుంభాభిషేకం ఉందనీ, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ టెంపుల్ కి ఇంతవరకు రాలేదనీ, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గంగమ్మ గుడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు.

ఎప్పుడైతే ఈ జాతరకు చాటింపు జరిగిన 5వ రోజు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఆడపడుచుకి సారే రావటం అనేది మన అందరికి తెలిసిన విషయమని, గతంలో తిరుమల వెళ్లే ముందు గంగమ్మ ని దర్శించుకుని అందరూ తిరుమల కి వెళ్లేవాళ్లనీ, వారు ఈ మధ్యలో బిజీ లైఫ్ లో చాలామంది దీనిని బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారనీ, అలా కాకుండా భక్తులు వారి యొక్క దర్శనం పరిపూర్ణమవ్వాలి అంటే భగవంతుని ఆశీస్సులు అందాలి అంటే ముందు గంగమ్మ దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుచానూరు వచ్చి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగ ఉంటాయి అనీ, గంగమ్మ జాతరలో అందరూ కూడా అనేక రకాలైన వేషాలు వేసుకొని అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలి అని చెప్పి ఆడ మగ అని తేడా లేకుండా అందరూ కూడా ఎంతో గొప్పగా కళారూపాలు చేస్తార నీ అన్నారు.

గత సంవత్సరం కూడా తాను మంత్రిగా మొదటిసారి గంగమ్మ జాతర జరుపుకోవడం కొరకు దాదాపుగా 25 లక్షల రూపాయలు తమ టూరిజం కల్చర్ శాఖ నుండి కళాకారుల ద్వారా ఇక్కడికి అందజేయడం జరిగిందనీ ఈ రాష్ట్రంలోనీ నలుమూలల నుంచి కళాకారులు వచ్చి అమ్మవారి జాతరలో పాల్గొనడం మనందరం కూడా కళ్ళారా చూసామనారు.మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రె<eడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టెంపుల్ నీ అభివృద్ధి చేయడం చూసిరాష్ట్ర ప్రభుత్వం తరఫున తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తన శాఖ ద్వారా డిక్లేర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాననీ తెలిపారు.

ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పండుగగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ కట్టా గోపి యాదవ్ గారు, ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎం ముని కృష్ణయ్య, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube