తాగుబోతు భర్తతో విస్తు పోయిన భార్య.. చివరికి ఏం చేసిందంటే..?

భర్త తాగుడుకు బానిసై, బాధ్యతా రహితంగా ఉంటూ తరచూ గొడవలతో వేధింపులకు గురి చేయడంతో విస్తు పోయిన భార్య చివరకు భర్తను గొడ్డలితో హతమార్చిన సంఘటన గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మొగలి రావుల చెరువు గ్రామంలో చోటుచేసుకుంది.

 Wife Murders Alcoholic Husband,wife,husband,alcoholic Man,murder News,viral,poli-TeluguStop.com

వివరాల్లోకెళితే.

మృతుడు మంద దేవరాజు (35), అలివేలు అనే యువతీని ప్రేమించి వివాహం చేసుకొని రావులచెరువు గ్రామంలో నివాసం ఉంటున్నాడు.వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కావడంతో అప్పుడప్పుడు బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు.

అయితే భార్య భర్తలు ఇద్దరికీ చెడు వ్యసనాలు( Bad Habits ) ఉన్నాయి.ఇద్దరు కూడా మద్యానికి బానిసగా మారారు.

Telugu Alcoholic, Latest Telugu, Complaint-Latest News - Telugu

భార్యాభర్తలు( Wife and Husband ) ఇద్దరు తరచూ గొడవపడేవారు.ఈ క్రమంలోనే శనివారం రాత్రి అలివేలు భర్తకు ఫుల్ గా మద్యం త్రాగించింది.భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత గొడ్డలితో నరికి చంపేసింది.ఈ విషయం బయటకు చెబితే తమను కూడా చంపేస్తానని కూతురు, కొడుకును హెచ్చరించడంతో వాళ్లు భయపడుతూ ఉండిపోయారు.

Telugu Alcoholic, Latest Telugu, Complaint-Latest News - Telugu

తర్వాత తనపై అనుమానం రాకుండా ఉండేందుకు నాన్న తలను గోడకు బాదుకొని చనిపోయాడు అంటూ బంధువులకు చెప్పమని పిల్లలను రాత్రి బంధువుల ఇంటికి పంపించింది.ఇంటికి వచ్చిన బంధువులు రక్తపు మడుగులో పడి ఉన్న దేవరాజు ను చూసి ఇది ప్రమాదవశాత్తు జరిగినది కాదని.అసలు ఏం జరిగింది అని కాస్త గట్టిగా అలివేలును నిలదీశారు.దీంతో తానే తన భర్తను గొడ్డలితో హతమార్చినట్లు అంగీకరించింది.తరువాత బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు( Police ) నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం ఉదయం గద్వాల జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube