తమిళంలో రజనీకాంత్( Rajinikanth ) కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చాలా ఏళ్లుగా ఆయన సినిమాల్లో సంపాదించుకున్న పాపులారిటీ అంతా కూడా రాజకీయాలకు ఒక బాట వేసినట్టుగా అందరూ అనుకున్నారు.
చాలా మంది స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల( Celebrities ) వరకు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు.సినిమాల్లో సూపర్ స్టార్ గా వెలుగొందడం చాలా ఈజీ కానీ రాజకీయం చేయడం అంత మామూలు విషయం కాదు అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించి అడుగు వేయాలి లేదంటే బొక్క బోర్లా పడ్డ ఆ సూపర్ స్టార్ మెగాస్టార్ ఉండనే ఉన్నారు.
ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టామంటే ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి రావడం జరగదు.వెనక్కి వచ్చామా.
మనం ఓడిపోయినట్టే అలా ఓడిపోవడానికి కూడా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ప్రతి ఒక్కరూ కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు.అతడు కూడా రాజకీయ పరంగా ముందుకు వస్తానని తన అభిమానులకు మాట ఇచ్చాడు.అలా మాట ఇచ్చిన తర్వాత అప్పటికే ఒప్పుకున్న కొన్ని సినిమాలు వరుస పెట్టి చేయాల్సి వచ్చింది దానికి చాలా ఏళ్ల సమయమే పట్టింది.
అప్పటికే రజనీకాంత్ ఆరోగ్యం కూడా కొంతమేర క్షీణించింది.తన కిడ్నీ 60 శాతం డ్యామేజ్ అయింది అన్న విషయం తెలిసి రజనీకాంత్ షాక్ కి గురయ్యాడు.కానీ రాజకీయాల్లోకి( politics ) వస్తానని కమిటీ అయ్యాడు కాబట్టి వెనక్కి వెళ్ళకూడదు అనుకున్నాడు దాంతో జనాల్లోకి వెళ్లి క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించుకున్నాడు.అదే టైంలో కరోనా తీవ్రత పెరిగింది.
మొదటి వేవ్ కరోనాలో ఎలాగోలా అందరూ బాగానే ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు.కానీ రాజకీయాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ ఎందుకో వెనకడుగు వేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు అయితే కరోనా రెండవ ప్రమాదం హెచ్చరికల సమయంలో పూర్తిస్థాయి క్యాంపెయిన్ కి రజనీకాంత్ సిద్ధమవుగా అందుకు అతని వ్యక్తిగత వైద్య నిపుణుల బృందం అందుకు ఒప్పుకోలేదు.ఒకవేళ వెళ్లిన జనాలకు దూరంగా ఉండాలని, మాస్క్ పెట్టుకోవాలని, శానిటైజర్ వాడాలంటూ ఖచ్చితమైన నిబంధనలు పెట్టారు ఇవన్నీ జరగడం అసాధ్యం కాబట్టి తాను క్యాంపెన్ నుంచి విరమించుకున్నాడు.దాంతో అతనిపై రాజకీయమైన దాడి మొదలైంది.
రజినీకాంత్ భయపడ్డాడు అంటూ సర్వత్రా విమర్శలు వచ్చాయి.ఇలా ఇంత మంది చేత ఇప్పుడే ఇన్ని అవమానాలు పడుతున్నాను అంటే ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో తన కళ్ల ముందు కనిపించింది.
దాంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు రజినీకాంత్.