బెంగళూరు జట్టుకు ఏప్రిల్ 23 గండం.. మళ్లీ హిస్టరీ రిపీట్ అవ్వనుందా..?

తాజాగా నేడు బెంగళూరు – రాజస్థాన్( Royal Challengers Bangalore ) మధ్య మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ లో గెలుపు-ఓటములు పక్కన పెడితే.

 April 23 Will Be The Day For The Royal Challengers Bangalore.. Will History Repe-TeluguStop.com

ఏప్రిల్ 23 అనేది బెంగుళూరు జట్టు ఎన్నటికీ మర్చిపోలేదు.బెంగళూరు జట్టుకు ఏప్రిల్ 23 ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది.అది ఎలానో చూద్దాం.2013 ఏప్రిల్ 23న పూణే వారియర్స్ – బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.క్రిస్ గేల్ ఈ మ్యాచ్లో 66 బంతులకు 175 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.ఐపీఎల్ లో క్రిస్ గేల్( Chris Gayle ) చేసిన 175 పరుగుల రికార్డును పదేళ్లుగా ఎవరు బ్రేక్ చేయలేకపోయారు.

బెంగుళూరు జట్టు 130 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

2017 ఏప్రిల్ 23 న కోల్ కత్తా – బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా 131 పరుగులు చేసింది.కానీ బెంగుళూరు జట్టు 9.4 ఓవర్లలో 49 పరుగులు చేసి పది వికెట్లు కోల్పోయింది.క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లు పది నిమిషాలు కూడా క్రీజులో ఉండలేకపోయారు.ఈ మ్యాచ్లో కేదార్ జాదవ్ 9 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

2022 ఏప్రిల్ 23న బెంగళూరు – హైదరాబాద్( Sunrisers Hyderabad ) మధ్య మ్యాచ్ లో బెంగళూరు జట్టు 16.1 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ డక్ అవుట్ అయ్యాడు.ఈ మ్యాచ్లో 15 పరుగులు చేసి స్కోరర్ ప్రభుదేశాయ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఏప్రిల్ 23న మ్యాచ్ జరిగిందంటే సీజన్లోనే అత్యధిక స్కోరు నమోదవడమో లేదంటే అత్యల్ప స్కోరు నమోదు అవ్వడమో జరుగుతూ ఉండడంతో బెంగళూరు జట్టు అభిమానులు నేడు జరిగే మ్యాచ్ పై ఆందోళన చెందుతున్నారు.చాలామంది అభిమానులు మ్యాచ్ గెలిచినా, ఓడిన మరోసారి బెంగుళూరు జట్టు ఘోరంగా భయపెట్టకూడదని కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube