ప్రముఖ టాలీవుడ్ నటుడు దేవరాజ్( Actor Devraj ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పుడున్న మా హీరోలతో నటించాలని ఇప్పటికీ ఉంటుందని అయితే డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వాలని ఆయన తెలిపారు.
దేవరాజ్ గారు మన సినిమాకు యూజ్ అవుతారు అనిపిస్తే ఆఫర్లు ఇస్తారని ఆయన కామెంట్లు చేశారు.
చిరంజీవి( Chiranjeevi ) గారికి బాలకృష్ణ( Balakrishna ) గారికి మధ్య తేడా ఏంటనే ప్రశ్నకు దేవరాజ్ స్పందిస్తూ ఇద్దరు హీరోలు పెద్ద హీరోలని బాలకృష్ణ గారు చాలా క్రమశిక్షణతో ఉంటారని, స్ట్రిక్ట్ గా ఉంటారని బాలయ్య అప్పుడే మేడ్ ఇన్ ఇండియా వస్తువులను మాత్రమే వాడేవారని ఈ లక్షణం బాలయ్యలో ఎంతగానో నచ్చేదని తెలిపారు.
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను ఆయన యూజ్ చేయలేదని దేవరాజ్ కామెంట్లు చేశారు.
చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం ఆయనలో ఉన్న గొప్ప విషయమని అలాంటి గొప్ప ఆలోచనలు రావడం సులువు కాదని ఆయన పేర్కొన్నారు.అప్పట్లో అన్ని పాత్రలు పోటాపోటీగా ఉండేవని దేవరాజ్ అన్నారు.ఎస్పీ పరశురాం, బంగారు బుల్లోడు సినిమాలలో మంచి పాత్రలు దక్కాయని ఆయన తెలిపారు.
సమరసింహారెడ్డి మూవీ షూట్ సమయంలో ముఖంపై దెబ్బ తగిలిందని దేవరాజ్ పేర్కొన్నారు.
నేను నటించిన సినిమాలను ఎక్కువగా చూడనని ఆయన తెలిపారు.అప్పట్లో నన్ను చూసి భయపడేవారని ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ లో వీడియోలు చేసి నన్ను రివర్స్ లో భయపెడుతున్నారని దేవరాజ్ వెల్లడించారు.నాకు రాజకీయాలపై ఆసక్తి లేదని కొంతమంది బంధువులు ఆహ్వానించినా పాలిటిక్స్ పై నేను దృష్టి పెట్టలేదని ఆయన పేర్కొన్నారు.సింపుల్ లైఫ్ అంటే నాకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు.