అతను పెంచుతున్నది దున్నపోతే, నెలకు రూ.9.60 లక్షలు సంపాదన, ఎలాగంటే?

పెంచుతున్నది దున్నపోతు, నెలకు రూ.9.60 లక్షలు సంపాదనా? మా చెవులలో ఎమన్నా పువ్వులు కనిపిస్తున్నాయా అని అనుకుంటున్నారా? మేము చెప్పేది నిజమేనండి బాబు.హర్యాణలో( Haryana ) ఉండే దున్నపోతులు చాలా ఫేమస్ మరి.ఈ రాష్ట్రంలో కోట్లల్లో విలువ చేసే దున్నలు దొరుకుతాయి.మరెందుకాలస్యం, విషయంలోకి వెళ్ళిపోదాం పదండి.

 If What He Grows Is Ploughed, He Earns Rs.9.60 Lakhs Per Month, How, Shehan Shah-TeluguStop.com

పానీపాత్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్ర సింగ్( Narendra Singh ) అనే రైతు ముర్రజాతి దున్నపోతును ఒకదానిని పెంచుకొంటున్నాడు.

దానికి అతగాడు ముద్దుగా షెహ‌న్‌షా ( Shehan Shah )అనే పేరు పెట్టాడు.15 అడుగుల పొడవు, ఆరడగుల ఎత్తుతో బాగా బలిష్టంగా వున్న ఆ దున్న వయస్సు పదేళ్లు.దాని ధర తెలిస్తే మీకు గూండాగిపోతుంది బాబు.ఈ దున్నపోతు ధర అక్షరాల రూ.25 కోట్లు అంటే మీరు నమ్ముతారా? వింటేనే షాకింగ్‌గా ఉంది కదా.దీనికి అంతరేటు ఎందుకో ఈ వివరాలు చూడండి.ఈ జాతి దున్నల వీర్యానికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.

ప్రస్తుతం నరేంద్రసింగ్ వద్ద ఉంటున్న షెహన్‌బాషా వీర్యాన్ని నెలలో నాలుగుసార్లు బయటకు తీస్తారు.

ఆ వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారట.దీన్ని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోసుకు రూ.300 వరకు ఖర్చవుతుంది.ఆ తర్వాత వీటిని మార్కెట్‌లో విక్రయించి నరేంద్రసింగ్‌ నెలకు రూ.9.60 లక్షలు సంపాదిస్తున్నారు అని తెలుస్తోంది.అందుకే ఈ ముర్రాజాతి దున్నలను హర్యాణాలో నల్ల బంగారం అని కూడా పిలుస్తారు.

కర్నాల్‌ నగరం అంటేనే ఈ దున్నలు ప్రసిద్ధి.నరేంద్రసింగ్‌ ఈ దున్న కోసం ఓ ప్రత్యేక ఈతకొలను కూడా కట్టించడం విశేషం.

వివిధ పోటీల్లో కూడా ఈ దున్న విజేతగా నిలిచిందట.ఓసారి నిర్వహించిన ఛాంపియన్‌షిప్‌ పోటిలో పాల్గొని ఏకంగా రూ.30 లక్షలు గెలుచుకుంది అని ఆ యజమాని ఎంతో గర్వంగా చెబుతున్నాడు.

Man Earning Rs.9.60 lakhs per month by nurturing Murrah Bull

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube