యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ క్యాన్సర్( University of Kansas Cancer Center ) సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఇండో అమెరికన్ వైద్యులకు “most productive faculty” అవార్డ్ లభించింది.క్యాన్సర్ , గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన పరిశోధన, చికిత్సలో చేసిన కృషికి గాను బ్రెస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ప్రియాంక శర్మ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ప్రతీక్ శర్మలను ఘనంగా సత్కరించారు.
ప్రియాంక శర్మ( Priyanka Sharma ).ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో నిపుణురాలు.యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో మెడికల్ ఆంకాలజీ విభాగంలో ఆమె ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అంతేకాకుండా క్యాన్సర్ సెంటర్ డ్రగ్ డిస్కవరీ, డెలివరీ, ఎక్స్‌పెరిమెంటల్ థెరప్యూటిక్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు కో లీడర్‌గా వ్యవహరిస్తున్నారు.ప్రియాంక తన కెరీర్‌లో ఎక్కువ భాగం రొమ్ము క్యాన్సర్(Breast cancer ) చికిత్సపై పనిచేశారు.
ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మరింత ప్రభావవంతమైన చికిత్సలను గుర్తించడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ క్యాన్సర్ సెంటర్ ప్రశంసించింది.అంతేకాకుండా ప్రియాంక.SWOG బ్రెస్ట్ కమిటీకి వైస్ చైర్‌గా వ్యవహరిస్తున్నారు.
SWOG బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ , నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌సీఐ) బ్రెస్ట్ క్యాన్సర్ స్టీరింగ్ కమిటీలో సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఇక ప్రతీక్ శర్మ( Prateek Sharma ) విషయానికి వస్తే.యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్, జీఐ ఫెలోషిప్ ట్రైనింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.క్యాన్సర్‌తో పాటు అన్నవాహికకు సంక్రమించే వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా ప్రతీక్ శర్మకు మంచి పేరుంది.అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీకి ఆయన అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు.
ఎసోఫాగియల్ కమిటీ ఆఫ్ వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా, అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు ప్రతీక్.సత్కారం సందర్భంగా ప్రియాంక శర్మ, ప్రతీక్ శర్మలను తోటి వైద్యులు , ప్రొఫెసర్లు , సిబ్బంది అభినందించారు.