Anushka: అనుష్క జాతకంలో పెద్దదోషం.. పెళ్లయితే అంతే సంగతట?

మామూలుగా కొందరి జాతకాలలో దోషాలు అనేవి ఉంటాయి.ఇక అదోషాల నుండి తప్పించుకోవటానికి కొన్ని కొన్ని పూజలు, హోమాలు చేస్తూ ఉంటారు.

 Big Mistake In Anushkas Horoscope What If She Gets Married-TeluguStop.com

ముఖ్యంగా ఇటువంటి దోషాలు అనేటివి సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు బాగా నమ్ముతూ ఉంటారు.వాళ్ల జాతకంలో ఏదైనా దోషం ఉంటే చాలు వెంటనే ఎక్కడికంటే అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

కొంతమందికి తీరని దోషాలు కూడా ఉంటుంటాయి.అయితే ఇప్పుడు అనుష్క ( Anushka ) జాతకంలో అటువంటిదే దోషముందని తెలుస్తుంది.

ఆమెకు పెళ్లి అయితే అంతే సంగతి అని తెలుస్తుంది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

తెలుగు ప్రేక్షకులకు అనుష్క గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకప్పటి ప్రేక్షకులకే కాకుండా ఇప్పటి ప్రేక్షకుల్లో కూడా ఆమె క్రష్ అని చెప్పాలి.ఆమె అందాన్ని చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అవుతారు.ఈమెకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి అభిమానం ఉంది.

ఇక అనుష్క తెలుగు సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా సూపర్ సినిమాతో ( Super Movie ) పరిచయమైంది.ఇక తొలిసారి నటనతోనే తన అందాల గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

Telugu Anushka, Anushka Shetty, Arundhati, Horoscope, Married, Prabhas, Tollywoo

ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ఇక ఈమె నటించిన అరుంధతి సినిమాతో( Arundhati ) మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి పలు సినిమాలలో నటించింది.ఆ తర్వాత అనుష్కకు ఎందుకో అంతగా కలిసి రాలేదు.పలు సినిమాలు ఆమెను బాగా నిరాశపరిచాయి.దీంతో ఒకప్పుడు వచ్చినంత అవకాశాలు కూడా ఆమెకు రావట్లేదు.

ఇక గతంలో కొంతకాలం సినిమాలకు కూడా గుడ్ బై చెప్పింది.ఆ తర్వాత మళ్లీ అవకాశాలు అందుకుంటూ విభిన్న పాత్రలలో చేస్తూ వస్తుంది.ఇక అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటినుంచి తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.ఎంతోమంది ఎన్నో ఇంటర్వ్యూలలో అనుష్కను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఎన్నోసార్లు ప్రశ్నించారు.

Telugu Anushka, Anushka Shetty, Arundhati, Horoscope, Married, Prabhas, Tollywoo

కానీ అనుష్క మంచిగా సెటిల్ అయిన తర్వాతనే అని చెప్పి తప్పించుకునేది.ఇక గతంలో ప్రభాస్ ని( Prabhas ) కూడా పెళ్లి చేసుకుంటుందని వారి మధ్య లవ్ నడుస్తుందని ఎన్నో పుకార్లు వినిపించాయి.అయితే ఇదంతా పక్కన పెడితే అనుష్క పెళ్లి చేసుకోకపోవటానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.అదేంటంటే ఆమె జాతకంలో ఒక పెద్ద దోషం ఉందట.అయితే ఆ దోషానికి పరిహారాలు చేసిన సరే ఆమె జీవితంలో కోలుకోలేని దెబ్బ తినాల్సి వస్తుందట.

Telugu Anushka, Anushka Shetty, Arundhati, Horoscope, Married, Prabhas, Tollywoo

దీంతో ఈ విషయం తెలుసుకున్న అనుష్క తన లైఫ్ లోకి వచ్చే అబ్బాయి కూడా హ్యాపీగా ఉండాలని.తన వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకూడదని వచ్చేవారి గురించి ఆలోచిస్తూ పెళ్లినే వదిలేసుకుందని తెలుస్తుంది.ఈ విషయం తెలిసిన కొందరు అనుష్క మనసు ఎంత గొప్పదో అంటూ కామెంట్లు పెట్టగా.

మరి కొంతమంది ఆమె ఎప్పుడు ఒంటరిగానే ఉండాలా అంటూ బాధపడుతున్నారు.మరి ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube