చాలామంది ప్రతి ఒక్క వంటకం లో కూడా వామును వినియోగిస్తూ ఉంటారు.ఎందుకంటే ఇది నోటికి రుచిని అందించడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగేందుకు సహాయపడుతుంది.
దీన్ని తీసుకోవడం వలన పొట్ట సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.అందుకే దీన్ని ఆహారంలో వినియోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.
వాము మాత్రమే కాకుండా దీని ఆకులు కూడా అన్ని రకాలుగా అన్ని అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగేందుకు సహాయపడుతుందనీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ ఆకును ఉపయోగించడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వాము ఆకుల్లో( vamu leaves ) చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.అందుకే దీనిని వినియోగించడం వలన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.ఇక వాము ఆకుల్లో క్రిమినాశక లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి.
అందుకే దీనిని వినియోగించడం వలన దగ్గు, జలుబు, ఆస్తమా( Cough, cold, asthma ) లాంటి శ్వాసకోశ సమస్యలు కూడా దూరం అవుతాయి.అందుకే ఈ ఆకులను మెత్తగా రుబ్బుకొని వాసన ను పిలిస్తే శ్వాస నాళాలు క్లియర్ అవుతాయి.ఇక చాలామంది గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం( Gas, bloating, constipation ) లాంటి జీర్ణకియ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు.అలాగే దీన్ని నమిలి తినడం వల్ల మరింత ప్రభావంతంగా సహాయపడుతుంది.
అందుకే జీర్ణక్రియ సమస్యలతో బాధడుతున్న వారు తప్పకుండా వాము ఆకులను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.అంతేకాకుండా వాము ఆకులో అనాల్జేసిక్ అధిక పరిమాణంలో ఉంటుంది.అందుకే దీన్ని తీసుకోవడం వలన తలనొప్పి, అలాగే ఇతర శరీర నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.అందుకే ఈ ఆకులను మిశ్రమంగా చేసి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేస్తే సులభంగా నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.